బెంగళూరు రత్తమ్మ బయోపిక్ లో అక్కినేని కోడలు!

0

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్థాయి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనే లేదు. ఆయన తెరకెక్కించిన ఒక్కో సినిమా ఒక్కో మైలు రాయి. మూకీ తీసినా.. టాకీలో ప్రయోగాలు చేసినా ఆయనకే చెల్లింది. 80లలోనే అనర్గళంగా ఆంగ్లం మాట్లాడుతూ హాలీవుడ్ స్థాయి సినిమాల్ని తెరకెక్కించిన గొప్ప దర్శకుడిగా అతడికి ఉన్న గౌరవమే వేరు.

90 ఏజ్ లోనూ ఆయనలో అదే నూతనోత్సాహం. ఓ వైపు కరోనా సోకినా దాని ప్రభావం ఆయన పై లేదు. దాని నుంచి కోలుకుని తిరిగి సినిమాలకు పని చేసేందుకు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు ఈ వెటరన్ దర్శకుడు.

అక్కినేని కోడలు సమంతతో ఆయన ఓ బయోపిక్ ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బెంగళూరు నారత్నమ్మ జీవిత కథ ఆధారంగా స్క్రిప్టును రెడీ చేస్తున్నారట. అయితే ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహిస్తారా శిష్యుల్లో ఎవరికైనా అవకాశం కల్పిస్తారా? అన్నది చూడాలి. సింగీతం వయసు దృష్ట్యా ఆయన దర్శకత్వ పర్యవేక్షణకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు. లేదా తనే స్వయంగా మెగా ఫోన్ చేపడతారా? అన్నది ఆయనే ప్రకటించాల్సి ఉంటుంది. నేటి జనరేషన్ కి తగ్గట్టు ఈ బయోపిక్ మేకింగ్ కోసం సింగీతం చాలానే హార్డ్ వర్క్ చేస్తున్నారట.