Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ దేశపు విమానాశ్రయంలో మన హీరోయిన్ విగ్రహం

ఆ దేశపు విమానాశ్రయంలో మన హీరోయిన్ విగ్రహం


బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా మరియు దీపిక పదుకునే లకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరు కూడా కేవలం ఇండియాలోనే కాకుండా దేశ విదేశాలలో అభిమానులను కలిగి ఉన్నారు. దీపిక పదుకునే ఇప్పటికే హాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆమె అందంతో పాటు నవ్వుకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడ ఆమెకు ఉన్నారు. దీపిక పదుకునే నవ్వు విషయంలో అతి ప్రత్యేకమైన మహిళ అంటూ ఆమె విదేశీ అభిమానులు అనుకుంటూ ఉంటారు. నవ్వుకు అభిమానులు అయిన వారు చాలా మంది ఉన్నారు. ఆమె నవ్వు గొప్పతనం మరోసారి నిరూపితం అయ్యింది.

తాజాగా ఈమె నవ్వుతున్న విగ్రహంను గ్రీస్ రాజధాని ఏథెన్స్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంచడం జరిగింది. కరోనా కారణంగా మూసి వేయబడ్డ విమానాశ్రయం ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ సందర్బంగా మళ్లీ విమాన ప్రయాణికులను నవ్వుతూ ఆహ్వానించే ఉద్దేశ్యంతో దీపిక పదుకునే నవ్వుతున్న ఒక ప్రతిమను అక్కడ ఏర్పాటు చేశారు. ఇది దీపిక పదుకునే యొక్క గౌరవం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏథెన్స్ విమానాశ్రయ అధికారులు ఆమె నవ్వుతున్న విగ్రహంతో ప్రయాణికులు అహ్లాదబరితం అవుతారనే ఉద్దేశ్యంతో ఆ విగ్రహంను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు.