నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

0

‘మనసు మమత’ టీవీ సీరియల్ తో తెలుగునాట పాపులర్ అయిన నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. తన మృతికి సాయి అనే వ్యక్తి కారణమని శ్రావణి తన స్నేహితుడితో చెప్పిన ఆడియో బయటకు వచ్చింది.

ఇక శ్రావణి కుటుంబ సభ్యులు తాజాగా సాయి అనే వ్యక్తియే కొట్టి హింసించేవాడని.. అతడి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని చెప్పుకొచ్చారు.

ఇక శ్రావణి స్నేహితుడు దేవరాజ్ రెడ్డి సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 7న తాను శ్రావణి కలిసి డిన్నర్ కు వెళ్లామని.. అక్కడ సాయి అనే వ్యక్తి వచ్చి శ్రావణిపై చేయి చేసుకున్నాడని దేవరాజ్ రెడ్డి వివరించారు.

శ్రావణికి ఐదేళ్లుగా సాయితో పరిచయం ఉందని.. తాను సంవత్సరం క్రితం శ్రావణికి స్నేహితుడను అయ్యానని దేవరాజ్ రెడ్డి తెలిపారు. సాయి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించాడు.

కాగా ఏనిమిదేళ్ల నుంచి మౌనరాగం మనసు మమత సీరియల్స్ లో శ్రావణి నటిస్తోంది.