రూ. 2 కోట్లు వెనక్కి ఇచ్చేసిన హీరో

0

హీరో గోపీచంద్ కెరీర్ ఒడిదొడుకుల మద్య కొనసాగుతుంది. ఈయన నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో పాటు కొన్ని సినిమాలు మద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని సినిమాలు విడుదల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. తాజాగా ఈయన కమిట్ అయిన ఒక సినిమా క్యాన్సల్ అయ్యిందట. దాంతో ఆయన అడ్వాన్స్ గా తీసుకున్న రెండు కోట్ల రూపాయలను వెనక్కు ఇచ్చాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.

గోపీచంద్ ప్రస్తుత కెరీర్ నేపథ్యంలో ఆయనకు అంత అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత ఎవరు అసలు సినిమా ఎందుకు క్యాన్సల్ అయ్యింది అంటూ ఇండస్ట్రీలో నలుగురు నాలుగు రకాలుగా అంటుకుంటున్నారు. బీవీఎస్ఎసన్ ప్రసాద్ నిర్మాణంలో తమిళ దర్శకుడు బిను సుబ్రమణ్యం దర్శకత్వంలో ఒక సినిమాను గోపీచంద్ కమిట్ అయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని అన్నారు. షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.

ఈ సమయంలోనే కొన్ని కారణాల వల్ల సినిమాను నిలిపేశారట. దాంతో నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ ను గోపీచంద్ తిరిగి ఇచ్చేశాడంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం గోపీచంద్ సీటీ మార్ అనే సినిమాను చేస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపించబోతుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న సినిమాను త్వరలో పూర్తి చేసి విడుదల చేసేందుకు సంపత్ నంది అండ్ టీం ప్రయత్నాలు చేస్తోంది.