సోలో బ్రతుకే.. సిడ్ శ్రీరామ్ మ్యాజిక్ అదరహో

0

సాయి తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కథానాయికగా నటించింది. సుబ్బు ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా `హే ఇది నేనేనా..` అంటూ సాగే పాటను విడుదల చేశారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రెండవ పాట ఇప్పటికే యువతరంలో వైరల్ అవుతోంది.

సాంగ్ ఆద్యంతం లవ్ ఇంటెన్సిటీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సిడ్ శ్రీరామ్ గాత్రం పెద్ద అస్సెట్ అనే చెప్పాలి. అతడి టోన్ ఈ ఓదార్పు గీతానికి సోలో బతుక్కి ఎంతో ఊరట. ఒంటరి బతుకు లవ్ లోకి ప్రవేశించాక ఇలానే ఉంటుంది మరి అన్న అర్థం ధ్వనించింది ఆ పాటలో. తేజ్ లో డెప్త్.. నభా నటేష్ కళ్ళలో భావాలు యువతరానికి చక్కిలిగింతలే పెడతాయి.

వరుసగా చార్ట్ బస్టర్ పాటల్ని అందిస్తున్న థమన్ మరోసారి అలాంటి ఆల్బమ్ నే ఇవ్వనున్నాడన్న నమ్మకం పెరుగుతోంది. అల వైకుంఠపురములో చిత్రంలో ప్రతిపాటా దేనికదే ప్రత్యేకంగా నిలిచాయంటే తమన్ వల్లనే. ఇప్పుడు సోలో బ్రతుకే… పాటలు ఆకట్టుకుంటున్నాయి. దీనిని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.