మమ్మీ అయ్యాక అనుష్కలో ఈ మార్పు చూశారా?

0

బాలీవుడ్ అందాల నాయిక అనుష్క శర్మ ఈ ఏడాది ప్రారంభంలో ఆడపిల్ల వామికాకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వామిక రాక అనంతరం విరుష్క జంట ఆనందానికి అవధుల్లేవ్. తమ జీవితంలో ప్రతి ఎగ్జయిటింగ్ మూవ్ మెంట్ ని ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. ఆ ఫోటోలు వీడియోలు అభిమానుల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి.

అనుష్క చాలా గ్యాప్ తర్వాత షూటింగ్ కి రిటర్న్ అయ్యారు. ఈ సందర్బంగా ఎంతో ఎగ్జయిట్ అవుతున్న ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఇటీవల ఆమె తన జీవితంలోని బెస్ట్ టైమ్ ని ఆస్వాధించింది. ఇప్పుడు మరో కొత్త ఫేజ్ లో అడుగుపెట్టబోతోంది. ఆ ఆనందం ఆ ముఖంలో కొట్టొచ్చినట్టే కనిపిస్తోంది.

ఇన్ స్టాలో ఈ ఫోటోని షేర్ చేయగానే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. గ్రీన్ టాప్ – నీలిరంగు ప్యాంటులో కనిపిస్తున్న అనుష్క ముఖంలో ఆనందం నవ్వు స్పష్ఠంగా హైలైట్ అయ్యింది. “సోమవారం ఒక ఆక్సిమోరాన్ సంతోషంగా ఉందా?“ అన్న వ్యాఖ్యను ఈ ఫోటోకి షేర్ చేశారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన 2018 మూవీ జీరో తర్వాత వేరొక సినిమాలో అనుష్క నటించలేదు. త్వరలో ఇర్ఫాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ను పరిచయం చేస్తూ అనుష్క ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. కథానాయికగా కెరీర్ ప్లానింగ్స్ గురించి అనుష్క వెల్లడించాల్సి ఉంది.