ఇప్పుడు క్రష్‌ ఆదిత్య రాయ్‌ కపూర్‌!

0

‘మజిలీ’ (majili Fame)చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు దివ్యాన్ష కౌశిక్‌.(Divyansha Kaushik) తదుపరి రవితేజ సరసన ‘రామారావు ఆన్‌డ్యూటీ’ సినిమాలో మెరిశారు. తొలిసారి ఆమె జత కట్టిన నాగచైతన్యతో (Naga chaitanya)దివ్యాన్ష కౌశిక్‌ రిలేషన్‌లో ఉందని పెళ్లి కూడా చేసుకోబోతుందనే వార్తలొచ్చాయి. కాస్త ఆలస్యంగా అయినా దివ్యాన్ష ఈ విషయంపై స్పందించారు. ‘‘నాగచైతన్య అంటే నాకు ఇష్టం. పరిశ్రమలో నాకు సీనియర్‌గా భావిస్తా. వృత్తిపరంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటాను. అయితే మా ఇద్దరిపై రిలేషన్‌, పెళ్లి రూమర్స్‌ (nagachaitanya rumors) ఉన్న విషయం నాకు తెలీదు. ఇప్పటి దాకా నా చివిన పడలేదు. ఈ మధ్యకాలంలో మేమిద్దరం మాట్లాడుకున్నది లేదు’’ అని వివరించారు.

తన సెలబ్రిటీ క్రష్‌ గురించి కూడా దివ్యాన్ష కౌశిక్‌ తెలిపారు. ‘‘నాకు విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టం. ‘అర్జున్‌ రెడ్డి’ చూసి ఆయనపై క్రష్‌ ఏర్పడింది. ఈ మఽధ్యన అమ్మాయిలందరూ ఆయన్నే ఇష్టపడుతున్నారు. దాంతో నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా క్రష్‌ ఆదిత్య రాయ్‌ కపూర్‌’’ అని అన్నారు. ప్రస్తుతం దివ్యాన్ష సందీప్‌ కిషన్‌ సరసన ‘మైఖేల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది.

Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.