డోనాల్డ్ ట్రంప్ కి కరోనా పాజిటివ్ !

0

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో గెలుపుకోసం అపసోపాలు పడుతున్న దేశాధ్యక్షుడు ట్రంప్ కు కొత్త సమస్య వచ్చి పడింది. నిన్నటివరకు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ట్రంప్కు అతి సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన ముఖ్య సహాయకురాలు హోప్ హిక్స్ కరోనా బారినపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్కు అత్యంత సన్నిహితురాలుగా పేరొందిన హిక్స్ కరోనా బారినపడటంతో తప్పనిసరై ట్రంప్ దంపతులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు ఆ పరీక్షల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.

ప్రస్తుతం తాము హోం క్వారంటైన్లో ఉన్నామని ట్రంప్ ట్వీట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటే ఉంటారు హోప్ హిక్స్. ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్తో పాటు తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. అంతేకాదు ఇటీవల ఓహియోలో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ కార్యక్రామానికి కూడా ట్రంప్తో కలిసి వెళ్లారు హోప్ హిక్స్.