Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘విశ్వక్’ టీజర్

‘విశ్వక్’ టీజర్


అజయ్ కతుర్వార్ – డింపుల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ”విశ్వక్”. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వేణు ముల్కాల దర్శకత్వం వహించారు. నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘విశ్వక్ ప్రపంచమంతా వ్యాపిస్తాడు’ అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్ మూవీపై ఆసక్తిని కలిగిస్తోంది. ”ఎన్నారైలకేమో బాధ్యత లేదు.. ఇక్కడున్న వాళ్లకి నిర్లక్ష్యం.. రైతువి నువ్వేం చేస్తున్నావ్ రా” అంటూ చెప్పే డైలాగ్ తో సినిమాలో ఏదో మంచి పాయింట్ చెప్పబోతున్నారని తెలుస్తోంది. ‘ఏం చేస్తున్నావ్ జర్నలిస్ట్’ అని ఓ లేడీ పాత్రధారి అడుగగా ‘ఏదైనా వైరల్ కంటెంట్ రాస్తే మా ఎడిటర్ పబ్లిష్ చేస్తానన్నారు’ అని మరో పాత్ర చెప్తుంది. ‘ఇంతకీ కంటెంట్ ఏంటని’ అడుగగా ‘ది గ్రేట్ ఫార్మర్స్ సూసైడ్ గురించి’ అంటూ సమాధానం చెప్తాడు. ‘ఇంకా ఎన్నాళ్లు ఇలా ఫార్మర్స్ ఇష్యూ గురించి చెప్తారు.. చాలా సినిమాలు వచ్చాయి కదా.. అది కాకుండా యూత్ గురించి ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా చెప్పొచ్చు కదా.. లవ్.. స్ట్రెస్.. వాళ్లలోని డిప్రెషన్ – స్ట్రగుల్స్’ అంటూ చెప్పుకొస్తుంది.

‘నువ్వు గెలవాలనుకుంటే నీకు సరైన వేవ్ లెన్త్ ఉన్న టీమ్ కావాలి.. ఆ టీమ్ బయట దేశంలో ఉంది..’ అంటూ సాగే డైలాగ్ తో యూత్ ని టార్గెట్ చేస్తూనే మరోవైపు ఎన్.ఆర్.ఐ.ల గురించి చెప్తున్నారని అర్థం అవుతోంది. ‘ఫుడ్ బెడ్ బావుందని పక్కింటికి వెళ్లి బతుకుతావా? బెటర్ లైఫ్ ఉందని పక్క దేశానికి వెళ్తావా? సిగ్గుందారా మీకు’ అంటూ ప్రశ్నిస్తున్నాడు హీరో. ‘ఇండియాలో లేనివారు అసలు ఇండియన్స్ కాదు. మీరు నిజంగా ఇండియాలో పుట్టినవారైతే.. నీ తెలివి అక్కడ తగలెట్టకుండా ఆగస్టు 15 నాటికి ఇండియాకి వచ్చేయాలి’ అని చెప్పడంతో స్వదేశీయులు తమ జ్ఞానాన్ని విదేశాల కోసం ఉపయోగిస్తున్నారని ఈ సినిమా ద్వారా ప్రశ్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ‘దేశాన్ని దత్తత తీసుకునేవారు కావాలి’ అని ప్లకార్డులు చూపించారు. మొత్తం మీద టీజర్ ద్వారా ఈ సినిమాలో రైతుల సమస్యలు చూపిస్తారా? యూత్ గురించి చెప్తారా? ఎన్నారైల గురించి చెప్తారా? అనే ఆసక్తిని కలిగించారు. ‘విశ్వక్’ చిత్రాన్ని గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తాడికొండ ఆనందం బాలకృష్ణన్ నిర్మించారు. సత్య సాగర్ పోలం సంగీతం అందించారు.