బిబి4 : మూడవ వారంలో మెరిసిన కుమార్ సాయి

0

బిగ్ బాస్ మొదటి వారం పూర్తి అయిన వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కుమార్ సాయి హౌస్ లో అడుగు పెట్టాడు. కమెడియన్ గా అతడు పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. కనుక హౌస్ లో కూడా ఎంటర్ టైన్ చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కాని కుమార్ సాయిని ఇంటి సభ్యులు సరిగా రిసీవ్ చేసుకోకపోవడంతో పాటు అతడు కలుపుకు పోలేక పోవడం ప్రేక్షకులకు అతడి నుండి అందాల్సిన ఎంటర్ టైన్ మెంట్ అందడం లేదు అనడంలో సందేహం లేదు. వరుసగా మూడు వారాల పాటు నామినేషన్ లో ఉన్న కుమార్ సాయి మూడు వారాలు కూడా కొత్తగా వచ్చాడనే రిజన్ తోనే నామినేట్ అయ్యాడు. అతడి తర్వాత వచ్చిన అవినాష్ దూసుకు పోతుంటే ఆయన మాత్రం ఇంకా ఒక మూలన ఉంటున్నాడు అంటూ విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు అతడికంటూ ఒక గుర్తింపు దక్కింది.

కిల్లర్ కాయిన్స్ వేటలో అనూహ్యంగా అతడు విజేతగా నిలిచి తదుపరి కెప్టెన్ గా నిలిచాడు. మూడు రోజుల పాటు జరిగిన కిల్లర్ కాయిన్ టాస్క్ అనేక మలుపులు తిరిగి చివరకు కుమార్ సాయి విజేత అయ్యేలా చేసింది. తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులను ఈ టాస్క్ కూడా ఎంటర్ టైన్ మెంట్ చేసింది. ఒకరి కాయిన్స్ ఒకరు దొంగిలించుకోవడం మార్చుకోవడం లాక్కోవడం వంటి ఆసక్తికర పరిణామాలతో బిగ్ బాస్ గత మూడు రోజులుగా ఆసక్తిగానే సాగింది. మెహబూబ్ కు సోహెల్ మరియు అఖిల్ లు కాయిన్స్ ఇవ్వగా అతడి వద్ద పది వేలకు పైగా అయ్యింది. అయితే సుజాత వద్ద ఉన్న స్విచ్ కాయిన్ తో అతడి వద్ద ఉన్న కాయిన్స్ మొత్తంను తీసేసుకుంది. ఆ స్విచ్ కాయిన్ మెహబూబ్ వదిలేసిందే అనే విషయం తెల్సిందే.

స్విచ్ కాయిన్ వల్ల ఫైనల్ రేసు నుండి మెహబూబ్.. సోహెల్.. అఖిల్ లు లేకుండా పోయారు. వారి వద్ద ఎక్కువ కాయిన్స్ ఉన్నా అన్ని కూడా సుజాతకు వెళ్ల పోవడంతో చివరి రౌండ్ లో సుజాత.. హారిక.. అమ్మ రాజశేఖర్.. కుమార్ సాయిలు ఆడారు. బురదలో కాయిన్స్ వేటలో కుమార్ సాయి విజేతగా నిలిచి ఇంటి కెప్టెన్ అయ్యాడు. అయితే ఈ వారంలో అతడు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యాడు. ఈ సారి సేవ్ అయితే వచ్చే వారం అతడు ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వడు.

నిన్నటి ఎపిసోడ్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే అది అమ్మ రాజశేఖర్ సోహెల్ ల మద్య జరిగిన సంఘటన. మొన్నటి ఎపిసోడ్ లో ఇద్దరి మద్య గొడవ జరిగింది. ఆ గొడవకు పశ్చాతాపంగా సోహెల్ వెళ్లి అమ్మ రాజశేఖర్ కాళ్లు పట్టుకుని సారీ చెప్పాడు. తన కాయిన్స్ ఇవ్వాల్సిందిగా మాస్టర్ అడుగగా అప్పటికే మెహబూబ్ కు ఇవ్వడంతో కుదరలేదు. దాంతో ఇద్దరి మద్య మళ్లీ మాటల యుద్దం జరిగింది. అలా నిన్న ఇంట్రెస్టింగ్ టాస్క్ తో సింపుల్ సన్నివేశాలతో ముగిసి పోయింది.