ఇద్దరూ కలిసే జిమ్ కెళుతున్నారా.. జరంత జాగ్రత్తమ్మోవ్!

0

లాక్ డౌన్ సమయం ఒక్కొక్కరికి ఒక్కోలా కలిసొచ్కింది. నిన్న మొన్నటి వరకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇంటికే పరిమితమైనా రకరకాల కొత్త వ్యాపకాల్ని నెత్తికెత్తుకుని టైమ్ పాస్ చేయగలిగారు. తమకు తోచిన పని చేస్తూ సోషల్ మీడియా ద్వారా దానికి సంబంధించిన వీడియోలని ఫొటోలని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం అన్లాక్ 5లో భాగంగా అన్ని కీలక రంగాలన్నీ రీఓపెన్ అవుతున్నాయి. దీంతో స్టార్స్ కూడా బయటికి రావడం మొదలుపెట్టారు.

జిమ్ లు తిరిగి రీఓపెన్ కావడంతో సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా జిమ్ ల బాట పడుతున్నారు. అదే కోవలో క్రేజీ హీరోయిన్స్ రాశిఖన్నా.. రష్మిక మందన్నసందడి చేయడం మొదలుపెట్టారు. వర్కవుట్ లు చేస్తూ క్రేజీగా ఛాలెంజ్ విసురుతున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ గా మారింది. ఒకే జిమ్ లో ఈ ఇద్దరు కలిసి వర్కవుట్లు చేస్తున్నారట. కుల్దీప్ సేథీ ఫిట్ నెస్ ట్రైనర్ సహకారంతో వర్కవుట్లు చేస్తున్నారు.

అంతేకాదు.. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫొటోకు ఆసక్తికరమైన క్యాప్షన్ ని జోడించింది రాశిఖన్నా. యాష్ కలర్ డ్రెస్ లో ట్విన్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. జిమ్ లో ఈ ఇద్దరు చేసే హంగామాతో సహజంగానే పొగలొచ్చేస్తున్నాయి మరి. ఇద్దరూ కలిసే నిరంతరం జిమ్ కు వెళుతున్నారా.. జాగ్రత్తమ్మో అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రష్మిక వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంటే యంగ్ హీరోలతో రాశీ అలా అలా లాగించేస్తోంది మరి.