రౌడీ- సుక్కూ క్రేజీ మూవీ వెనక బన్ని హస్తం

0

రౌడీ విజయ్ దేవరకొండ వరుస కమిట్ మెంట్లు అంతకంతకు హీట్ పెంచేస్తున్న సంగతి తెలిసిందే. దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీ ఫైటర్ ని తెరకెక్కిస్తున్నారు. అన్ లాక్ 5.0లో షూటింగ్ ని ప్లాన్ చేసారు. ఈలోగానే దేవరకొండ నుంచి మరో అదరిపోయే ప్రకటన వచ్చింది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ .. హీరో విజయ్ దేవరకొండల కలయికలో ఒక క్రేజీ పాన్-ఇండియన్ చిత్రం ప్రకటించడం సంచలనమే అయ్యింది. దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని కేదర్ సెలగంసెట్టి `ఫాల్కన్ క్రియేషన్స్` బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరు? ఉన్నట్టుండి కొత్త పేరు తెరపైకొచ్చిందే అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.

అయితే కేదార్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే అయినా.. అల్లు సర్కిల్స్ కి తెలిసిన వాడేనట. స్టార్ హీరో అల్లు అర్జున్ కు కేదర్ మంచి స్నేహితుడు. ఇటీవలే స్టైలిష్ స్టార్ కేదార్ ను కలుసుకున్నారట. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ తో చిత్ర నిర్మాణానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని బన్ని వ్యక్తిగతంగా అభినందించారని తెలుస్తోంది. ఈ చిత్రానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులందరి నుండి అదనపు మద్దతు లభిస్తుందనడంలో సందేహమేం లేదు. జీఏ2 బ్యానర్ లో టాక్సీవాలా లాంటి హిట్ చిత్రంలో నటించాడు దేవరకొండ. అప్పటి నుంచి బన్ని మద్ధతు ఉంది. ఇక మహేష్ అభిమానులు.. అల్లు అర్జున్ అభిమానుల నుంచి.. కేసీఆర్ కేటీఆర్ అభిమానుల నుంచి కూడా దేవరకొండకు కావాల్సినంత మద్ధతు లభిస్తుండడం ఆసక్తికరం.