‘ఖుషి’ ఎడిటర్ కన్నమూత

0

2020 సంవత్సరంలో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఎంతో మంది సినీ ప్రముఖులు కన్నమూశారు. కొందరు కరోనా వల్ల మరి కొందరు ఇతర అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. ఒకరి మృతి విషాదం నుండి తేరుకోకుండానే మరొకరు మృతి చెందుతూ ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో విషాదంలోనే ఉంటుంది. ఈ ఏడాది ఆరంభం నుండి కూడా ఇండస్ట్రీలో అనేక మంది మృతి చెందారు. తాజాగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ సూపర్ హిట్స్ లో ఒకటి అయిన ‘ఖుషి’ సినిమా ఎడిటర్ కోలా భాస్కర్ క్యాన్సర్ తో మృతి చెందారు.

55 ఏళ్ల కోలా భాస్కర్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం జాయిన్ అయ్యాడు. ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో తుది శ్వాస విడిచారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలకు కోలా భాస్కర్ ఎడిటింగ్ చేశారు. తెలుగుతో పాటు పలు భాషల సినిమాకు టెక్నీషియన్ గా పని చేసిన కోలా భాస్కర్ మృతితో తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. ఆయనతో వర్క్ చేసిన పలువురు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళ్లు అర్పించారు.