మెగా ప్రిన్సెస్ నీహారిక పెళ్లి తేదీ వెన్యూ ఫిక్స్

0

మెగా డాటర్ నీహారిక కొణిదెల పెళ్లి తేదీ వెన్యూ ఫిక్సయ్యాయి. గుంటూరుకు చెందిన ఐజీ కుమారుడు చైతన్యతో ఇంతకుముందు నిశ్చితార్థం కాగా.. ఇప్పుడు ఇరువైపులా కుటుంబ సభ్యులు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లు ఖరారు చేశారని తెలిసింది.

డిసెంబర్ 9 న రాజస్థాన్ ఉదయపూర్ లో ఐదు నక్షత్రాల హోటల్ ‘ది ఒబెరాయ్ ఉదైలాస్ ప్యాలెస్’ లో వివాహం జరగనుంది. ఆ మేరకు పెద్దలు వెన్యూ ఫిక్స్ చేశారని తెలిసింది. డిసెంబర్ 9న సాయంత్రం 7:15 గంటలకు తాళి కట్టు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ వివాహ కార్యక్రమం కోవిడ్ నిబంధనల నడుమ కట్టుదిట్టమైన భద్రతల్ని పాటిస్తూ.. ఇరు కుటుంబ సభ్యులు పరిమిత అతిథుల సమక్షంలో జరుగుతుంది. మొత్తం మెగా కుటుంబం నిహారికా – చైతన్యల వివాహానికి హాజరుకానుంది.

పెళ్లి తర్వాతా నిహారిక సినిమాల్లో నటిస్తారా? అంటే దానికి ఇంకా సమాధానం రావాల్సి ఉంది. నిహారికా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చైతన్య హైదరాబాద్ లోని ఒక టాప్ ఐటి సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నారు.