`రాజా ది గ్రేట్` సీక్వెల్ ప్లాన్ లో రావిపూడి?

0

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ `ఎఫ్ 3` పై దృష్టి పెట్టారు. కరోనావైరస్ మహమ్మారి రాకతో కావాల్సినంత సమయం అతడికి చిక్కింది. ఈ లాక్ డౌన్ సమయంలో తీరిగ్గా స్క్రిప్టుల కు మెరుగులద్ది.. ఇప్పుడు ప్రీప్రొడక్షన్ పనుల్ని అంతే తాపీగా చేస్తున్నారు. మహమ్మారీ శాంతించడం ఇప్పట్లో కష్టమేనని తేలింది కాబట్టి ఇకపై ఎఫ్ 3కి సంబంధించి వేగం పెరుగుతుందనే అభిమానులు భావిస్తున్నారు.

ఓవైపు ఎఫ్ 3కి సన్నాహాలు చేస్తూనే అనీల్ రావిపూడి తన `రాజా ది గ్రేట్` స్టార్ రవితేజతో ఒక ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ చిత్రం రాజా ది గ్రేట్ కి సీక్వెల్ కాదా లేదా కొత్త స్క్రిప్ట్ నా? అన్నదానిపై సరైన క్లారిటీ రాలేదు.

మాస్ మహారాజా రవితేజతో అనీల్ రావిపుడి ఇటీవల కలుసుకుని స్క్రిప్ట్ వినిపించారు. అయితే రవితేజ ఫైనల్ సిగ్నల్ ఇచ్చారా లేదా? అన్నది తేలాల్సి ఉంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి నిర్మిస్తారు. ఎఫ్ 3 షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమవుతుంది. ఈ మూవీ తర్వాత రాజా ది గ్రేట్ సీక్వెల్ ని తెరకెక్కించే ఛాన్సుంటుందని భావిస్తున్నారు. అయితే ఇటీవలే ఫిదా బ్యూటీ సాయిపల్లవికి అనీల్ రావిపూడి ఓ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ వినిపిస్తే దానిని తిరస్కరించిందని గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడున్న ఆఫర్లలో అధికారికంగా ఏ మూవీని సెట్స్ పైకి తీసుకెళతారో రావిపూడి క్లారిటీగా చెప్పాల్సి ఉంది ఇంకా.