Eesha Rebba | ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవూపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పటికే ‘పిట్ట కథలు’ ‘ త్రీ రోజెస్’లాంటి వెబ్ సిరీస్ లో మెరిసింది ఈషారెబ్బ (Eesha Rebba).అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది.
హాట్ అందాల భామ ఈషా రెబ్బా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది ఈషా రెబ్బా. తెలుగు భామ అయిన ఈమెకు టాలీవుడ్ అగ్ర హీరోలెవరు ఛాన్సులు ఇవ్వడం లేదు.
తాజాగా గోల్డ్ కలర్ డ్రెస్‌లో ఈషా రెబ్బా షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ షేక్ చేసే విధంగా ఉన్నాయి. ఈషా రెబ్బా డిజైనర్ వేర్‌లో మెరిసింది. తాజాగా వెరైటీ డ్రెస్ వేర్‌లో ఉన్న ఈషా అందాలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి.
రోజా విరబూసినట్లు ఉండే ఆమె చిరునవ్వు కుర్రాళ్ల హృదయాలకు చిల్లులు పెడుతోంది. ఈమె తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. కానీ ‘అంతకు ముందు ఆ తర్వాత’ మూవీతో హీరోయిన్‌గా లీడ్ రోల్లో నటించింది.
’అంతకు ముందు ఆ తర్వాత’ మూవీ తర్వాత ‘అమీ తుమీ’ ‘బందిపోటు’‘అ’, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రాలు మాత్రమే ఈషారెబ్బా కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా ఈమె అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది.
ఈషా వెండితెరకు పరిచయమై దాదాపు 10 ఏళ్ళు కావస్తుంది. మంచి ఆరంభం లభించినా స్టార్ కావడానికి అవసరమైన బ్రేక్ రాలేదు.సాధారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు. లోకల్ అని మన హీరోలు ఈమెను లైట్ తీసుకున్నట్టు కనబడుతోంది.
‘రాగల 24గంటలు’ మూవీలో మెయిన్ లీడ్ గా చేసింది. ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించకపోవడం ఈషా బ్యాడ్ లక్. అందం, టాలెంట్ ఉండి కూడా సరైన గుర్తింపుకు నోచుకోలేకపోతుంది. ప్రస్తుతం ఆమె తమిళ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. రెండు తమిళ చిత్రాలతో పాటు.. ఓ తెలుగు మూవీలో నటిస్తోంది ఈషా.
ప్రస్తుతం తమిళంలో `అయిరామ్ జెన్మంగల్` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు `ఒట్టు` అనే తమిళం, మలయాళం బైలింగ్వల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాల ఫలితాలు ఈషా సౌత్ కెరీర్‌ని డిసైడ్ చేయబోతున్నాయని చెప్పొచ్చు. (Image Credit : Instagram)