ఆ నటి ట్రాన్స్జెండర్..! అభిమానుల షాక్

0

హాలీవుడ్ నటి ఎలెన్పేజ్ ఓ ఆసక్తికర విషయంచెప్పి తన అభిమానులను ప్రేక్షకులను షాక్ కు గురిచేశారు. తాను మెదట అబ్బాయినని.. తర్వాత లింగమార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారానని ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. 1987 ఫిబ్రవరి 21న కెనడాలో పుట్టిన ఈ నటి.. ‘జానో’ సినిమాతో అంతర్జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్మెన్ సిరీస్ ఇన్సెప్షన్ సినిమాల్లోనూ ఆమె నటించింది. ఇంతకాలం ఈ విషయం తెలియని ఫ్యాన్స్ సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్గు గురయ్యారు.

లింగమార్పిడి చేసుకోవడం విదేశాల్లో సాధారణమే. అనేకమంది లింగమార్పిడి చేసుకుంటారు. అయితే ఓ సినీ నటిని ఇంతకాలం అమ్మాయిగా ఊహించుకున్న అభిమానులు.. ఆమె లింగమార్పిడి చేయించుకోనే సరికి కొంతమేర షాక్ అయ్యారు.ఈ విషయంపై ఎలెన్పేజ్ మాట్లాడుతూ.. ‘నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. నాకు ఈ విషయంపై మద్దతు దొరుకుతుందని ఆశిస్తున్నా’అని చెప్పారు. ‘ద అంబ్రెల్లా అకాడమీ’ వెబ్ సీరిస్ తో ఆమె ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఆమెను అందాలనటిగా ఊహించుకున్న ఫ్యాన్స్కు ఈ వార్త విని మైండ్ బ్లాక్ అయ్యింది. అమె ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రకటించారు.

నాలా నేను బతకడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. ట్రాన్స్ జెండర్ల సంఘం నుంచి నాకెంతో మద్దతు లభించింది. మీ ధైర్యానికి ఉదార స్వభావానికి నా అభినందనలు. మీకు ఈ సమాజంలో సమాన గుర్తింపు లభించడానికి నా వంతు ప్రయత్నం మద్దతు అలుపులేని పోరాటం చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. కానీ మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే. కాస్త సహనం వహించండి. ఈ విషయాన్ని ధైర్యంగా ఆనందంగా బయటపెడ్తున్నా కూడా దీని తర్వాతి పరిణామాల గురించి నా మనసు కలవరపడుతోంది.’ అని అన్నారు.కానీ నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఎలెన్పేజ్ నువ్వో రియల్హీరో నిజాన్ని నిర్భయంగా చెప్పావు అంటూ చాలా మంది ఆమెకు అండగా నిలబడ్డారు.