ఇషా .. స్విమ్ సూట్ జిప్ నిలవనంటోంది!

0

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ఇషా గుప్తా పరిచయం అవసరం లేదు. ఈ మాజీ మిస్ హాట్ నెస్ కి కవ్వింతకు కేరాఫ్ అడ్రెస్. ఫెమీనా మిస్ ఇండియా దివా పోటీలకు జడ్జిగా .. మోడల్స్ శిక్షకురాలిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ ఈ భామ. ఇషా గుప్తా స్టైల్ అండ్ ఫ్యాషన్ ఐకన్ గా దశాబ్ధాల పాటు పాపులారిటీని కొనసాగిస్తున్నారు. ఇక ఎందరో అందాల రాణుల్ని తయారు చేసే ఇనిస్టిట్యూషన్స్ లో తానో స్పెషలిస్ట్ లెక్చరర్.

పబ్లిసిటీని పరాకాష్ఠకు తీసుకెళ్లడంలో ఇషా గుప్తాని కొట్టేవాళ్లే లేరంటే నమ్మగలరా? తన ఇషా ఇన్ స్టా ఫోటోలకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రెగ్యులర్ గా తనని అనుసరించే వారి సంఖ్య లక్షల్లో ఉంది. గత కొంతకాలంగా క్వారంటైన్ టైమ్ ని ఇషా ఇదిగో ఇలా లేటెస్ట్ ఫోటోషూట్లతోనే స్పెండ్ చేస్తున్నారు. తాజా ఫోటోలో స్విమ్ వేర్ లో కనిపించింది. ఇక ఇషా ధరించిన ఆ స్విమ్ సూట్ కి జిప్ నిలవనంటోంది.

`జన్నత్ 2` చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన్న ఇషా తొలి ప్రయత్నం ఇమ్రాన్ హష్మి సరసన నాయికగా నటించింది. ఆ తర్వాత వేడెక్కించే సన్నివేశాల్లో ఎలాంటి మొహమాటం లేని నాయికగా పాపులరైంది. కమెండో 2 సహా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హేరాఫేరి 3లోనూ నాయికగా నటిస్తోంది. అలాగే `దేశీ మ్యాజిక్` అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇక పలు టీవీ చానెళ్లలో ఫ్యాషన్ డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగానూ కొనసాగుతూ బిజీగా ఉంది.