మామ బర్త్ డే వేడుకలను ప్రారంభించిన సామ్

0

టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ఈనెల 29న పుట్టిన రోజు జరుపుకోబోతున్న విషయం తెల్సిందే. ఈ సందర్బంగా ఫ్యాన్స్ కోసం కామన్ డీపీని విడుదల చేయడం జరిగింది. ఈ కామన్ డీపీని సమంత చేతుల మీదుగా విడుదల అయ్యింది. నాగార్జున ఫ్యాన్స్ కోసం సమంత విడుదల చేసిన కామన్ డీపీ అందరిని ఆకట్టుకుంటోంది. నాగార్జున సినీ కెరీర్ లో వేసిన ఎన్నో పాత్రలను ఈ డీపీలో చూపించడం జరిగింది. అక్కినేని ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా ఉన్న ఈ కామన్ డీపీ సమంత చేతుల మీదుగా విడుదల అవ్వడం మరింత ఆనందాన్ని ఫ్యాన్స్ కు కలిగిస్తుంది.

మామయ్య కామన్ డీపీ విడుదల సందర్బంగా సమంత ట్విట్టర్ లో స్పందిస్తూ.. ది కింగ్ నాగార్జున గారి పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేకమైన డీపీని విడుదల చేసే అవకాశం నాకు రావడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఆయనపై ఎప్పుడూ ప్రేమ గౌరవం ఉంటుందని. ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండే నాగార్జున గారికి అడ్వాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఫ్యాన్స్ కోసం కామన్ డీపీ మరియు హ్యాష్ ట్యాగ్ ను షేర్ చేసింది. నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా సమంత విడుదల చేసిన ఈ డీపీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక నాగ్ తన పుట్టిన రోజున బిగ్ బాస్ ను షురూ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.