ప్రభాస్ తో మరోటి ఆశిస్తుందా?

0

ప్రభాస్ గురించి ఆయనతో నటించిన వారు చాలా బాగా చెబుతూ ఉంటారు. ఆయన మంచి తనం మరియు ఆయన మృదు స్వభావం ఇలా అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా సింపుల్ అండ్ స్వీట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయనతో వర్క్ చేసిన వారు మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారు. సెట్స్ లో ఆయన ప్రవర్తన గురించి ఇప్పటి వరకు ఎంతో మంది లెక్కలేనన్ని విధాలుగా చెప్పడం జరిగింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కూడా ప్రభాస్ తో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలన్నంత ఉత్సాహంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.

టాలీవుడ్ లో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్స్ ఒకప్పుడు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కాని ఇప్పుడు ప్రభాస్ తో నటించేందుకు మాత్రం ఏ హీరోయిన్ కూడా నో చెప్పడం లేదు. పైగా ఒక్కసారి నటిస్తే మళ్లీ నటించాలని అనుకుంటున్నారు. శ్రద్దా కపూర్ సాహో విడుదల అయ్యి సంవత్సరం గడిచినా కూడా ఇంకా ఆయనతో కనెక్షన్ ను కంటిన్యూ చేస్తుందట. ఇద్దరి మద్య రెగ్యులర్ గా కాల్స్ మెసేజ్ లు ఉంటాయట. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ తో శ్రద్దా కపూర్ మరో సారి నటించాలనే ఆశ పడుతుందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతానికి ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే దీపిక పదుకునే ఎంపిక అయ్యింది. ఇక ఆదిపురుష్ లో ఎవరు నటిస్తారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు కాకుండా ఒక తమిళ దర్శకుడి సినిమాలో కూడా ప్రభాస్ నటించేందుకు రెడీ అవుతున్నట్లుగా కొత్త వార్తలు వస్తున్నాయి. మరి ఆ సినిమాలో శ్రద్దాకు ఛాన్స్ ఇచ్చేనా చూడాలి.