అనుష్క కామెంట్ పై మాజీ వికెట్ కీపర్ మండిపాటు

0

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి.. బాలీవుడ్ క్రేజీ స్టార్ అనుష్క శర్మ.. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మధ్య మాటల యుద్దం పెద్ద రచ్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. ఇదిలా వుంటే గవాస్కర్ కు మద్దతుగా #weSupportGavaskar అనే హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యింది. అనుష్కకు సోషల్ మీడియా మద్ధతు లభించింది.

వివాదం హద్దులు దాటుతుండటంతో మాజీ క్రికెటర్లు రంగంలోకి దిగారు. గవాస్కర్ ని రిస్క్ చేస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆయనకు మద్దతుగా నిలవడం ఆసక్తికరంగా మారింది. టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన మద్దతు ప్రకటించగా మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ బాహాటంగా తన మద్దతు తెలపడమే కాకుండా గవాస్కర్ వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారని మండిపడ్డారు. గవాస్కర్ మాటల్లో అభ్యంతరం ఏమీ లేదని.. తను హాస్యానికి అలా మాట్లాడి వుంటాడే కానీ కావాలని చెప్పి వుండడని చెప్పుకొచ్చాడు.

అంతే కాకుండా భారతీయులకు హాస్య చతురత చాలా తక్కువని విరాట్ – అనుష్కల గురించి గవాస్కర్ మాట్లాడి వుంటే అది హాస్య స్వరంలోనే మాట్లాడి వుంటాడని.. గవాస్కర్ గురించి తనకు బాగా తెలుసని.. ఆ విషయాన్ని తాను గట్టిగా నమ్ముతున్నానన్నారు. ఇక విరాట్ కు అందమైన భార్య అనుష్క.. అలాంటప్పుడు వారిని విమర్శించే అవసరం నాకు గానీ గవాస్కర్ కు గానీ లేదని స్పష్టం చేశారు ఫరూక్. టీ20 మ్యాచ్ వైఫల్యంతో కోహ్లీపైనా అతడి భార్యామణి అనుష్క శర్మపైనా గవాస్కర్ బౌన్సర్ వేయడంతో ఇంత రచ్చయ్యింది.