ఒక్క సినిమా అయిదుగురు దర్శకులు.. విడుదలకు రెడీ

0

ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాల మేకింగ్ లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో వెబ్ సిరీస్ లు మరియు ఒక్క సినిమాను పార్ట్ లుగా తెరకెక్కించడం వంటివి చేస్తున్నారు. కొన్ని ప్రయోగాలను ఫీచర్ ఫిల్మ్ లో చేయడం సాధ్యం అవ్వదు. అలాంటి ప్రయోగాలను ఓటీటీ సినిమాల్లో చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ తర్వాత అత్యంత ప్రజాధరణ దక్కించుకుంటున్న అమెజాన్ కూడా భారీ బడ్జెట్ తో వెబ్ సిరీస్ లు మరియు డిజిటల్ మూవీలను నిర్మిస్తుంది. తమిళంలో అమెజాన్ పుతం పుదు కలై అనే టైటిల్ తో విభిన్నమైన సినిమాను నిర్మించారు. ఈ సినిమా అయిదు షార్ట్ ఫిల్మ్ ల కలయికగా ఉంటుంది.

ఈ అయిదు షార్ట్ ఫిల్మ్ లకు అయిదుగురు ప్రముఖులు దర్శకత్వం వహించడం విశేషం. అయితే విభిన్నమైన కథలను అయిదుగురు దర్శకులు అయిన సుహాసిని మణిరత్నం.. రాజీవ్ మీనన్.. గౌతమ్ వాసు దేవ్ మీనన్.. సుధ కొంగర.. కార్తీక్ సుబ్బరాజు లు తెరకెక్కించారు. ఈ సినిమాను అమెజాన్ ఈనెల 16వ తారీకున స్ట్రీమింగ్ కు రెడీ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు ఇంకా పలు భాషల్లో కూడా డిజిటల్ మూవీని స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. అయిదు ఇన్సిపిరేషన్ కథలను ప్రముఖులతో చెప్పించడం వల్ల ఈ మూవీపై తమిళ ఆడియన్స్ చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు.