అన్నపూర్ణ ఏడెకరాల్లో సినీకార్మికులకు ఉచిత కరోనా టెస్టులు

0

సినీ కార్మికులకు ఉచిత కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. ఆరోగ్యశాఖ మంత్రివర్యులు ఈటెల రాజేంద్ర సహకారంతో కరోనా లక్షణాలు ఉండి టెస్ట్ చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం GHMC సహాయంతో టెస్టులు చేయనున్నామని `మనం సైతం` నిర్వాహకుడు కాదంబరి కిరణ్ ప్రకటించారు.

అన్నపూర్ణ 7 ఎకరాలు పరిసరాల్లోని జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ వద్ద సోమవారం (24/8/20) ఉదయం 11 గంటల నుంచి కరోనా టెస్టులు చేయనున్నారు. కేవలం కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఆధార్ కార్డు యూనియన్ కార్డు లు జెరాక్స్ కాపీ తీసుకోని మాస్క్ ధరించి రావాల్సిందిగా ఓ ప్రకటనలో తెలిపారు.

కరోనా మొబైల్ పరీక్షలు వాహనం వచ్చిన తరువాత మీకు మెసేజ్ ద్వారా తెలియజేస్తాం. ఈ అవకాశం తొలివిడతగా లక్షణాలు ఉన్నవారు ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. పూర్తి వివరాల కోసం N.అనిత- +91 94401 04342 .. సీసీ శ్రీను- +91 90009 88872 నంబర్లను అందుబాటులో ఉంచారు. కరోనా పాజిటివ్ ఉంటేనే ఈ టెస్టులకు జూనియర్ ఆర్టిస్టులు రావాల్సి ఉంటుంది.