‘ఆచార్య’ నిర్మాణంలో రాంచరణ్ ఆసక్తి చూపట్లేదా..??

0

టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా పై సినీ వర్గాలలో మెగా అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో టాప్ డైరెక్టర్ స్థానంలోకి చేరాడు. తన ప్రతి సినిమాలో ఏదొక సందేశంతో మాస్-క్లాస్ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తూనే ఉన్నాడు. చివరిగా ‘సైరా నరసింహరెడ్డి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ ‘ఆచార్య’తో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నాడు.

అయితే ఆచార్య సినిమా షూటింగులో ఉండగానే.. సినిమా గురించి చర్చలు వివాదాలు నడిచాయి. ప్రస్తుతం ఆచార్య సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్ కొణిదెల ప్రొడక్షన్స్ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ నుండి ఆచార్య సినిమా నిర్మాణానికి రాంచరణ్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదని మొత్తం ప్రొడక్షన్ అంతా మాట్నీ ఎంటర్టైన్మెంట్ వారే చూసుకుంటున్నారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాను రాను ఇలాంటి వార్తలు సినిమాను దెబ్బతీసేలా ఉన్నాయని అప్పుడే మాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ ఈ విషయం పై స్పందించింది.

“ఆచార్య సినిమా నిర్మాణంలో మాట్నీ ఎంటర్టైన్మెంట్ వారి బడ్జెట్ ఎంత ఉందో కొణిదెల ప్రొడక్షన్స్ వారిది కూడా అంతే ఉందని తెలిపారు. అంతేగాక ప్రతి ఖర్చులోను నిర్మాత రాంచరణ్ తమతో సగం ఖర్చును షేర్ చేసుకుంటున్నట్లు వివరించారు. అయితే తాజాగా విడుదల చేసిన మెగాస్టార్ ఫస్ట్ లుక్ అలాగే మోషన్ పోస్టర్ లో రాంచరణ్ పేరు కంటే కూడా కొణిదెల ప్రొడక్షన్స్ అండ్ సురేఖ పేర్లు హైలైట్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రాంచరణ్ ఆచార్య సినిమాకు కేవలం సమర్పకుడుగా వ్యవహరిస్తున్నాడని.. అంతేగాక సినిమా నిర్మాణంలో ఎలాంటి చురుకుదనం చూపించట్లేదని టాక్. ఎందుకంటే ఇప్పటికే సైరా నరసింహ రెడ్డి మూవీతో లాస్ ఎదుర్కోవడం.. అలాగే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీ ఉండటం వలన ఆచార్య నిర్మాణంలో ఆసక్తి చూపట్లేదని సమాచారం. చూడాలి మరి చరణ్ ఏమైనా స్పందిస్తాడేమో..!