సీఎంను మరింతగా రెచ్చగొడుతోంది

0

మహారాష్ట్రలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా శివ సేన అంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. వారితో పెట్టుకోవాలంటే ఎంతటి వారు అయినా కాస్త భయపడాల్సిందే. శివసేన కార్యకర్తలకు ముంబయిలో చాలా ప్రాముఖ్యత ఉంది. పార్టీ అధినాయకత్వంకు విమర్శలు చేసిన వారి విషయంలో శివసేన కార్యకర్తలు కఠినంగా ఉంటారు అనేది చాలా మంది అభిప్రాయం. ఆమద్య కంగనా కేవలం ముంబయి పోలీసులపై మరియు ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే ఆమెను చంపేస్తామన్నంతగా హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా ఆమె సీఎం ఉద్దవ్ ఠాక్రేను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తోంది. ఇప్పటికే ముంబయిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చినందుకు గాను ఆమె ఆఫీస్ ను సగం వరకు నేల మట్టం చేయడం జరిగింది.

కంగనాపై డైరెక్ట్ ఎటాక్ మొదలు పెట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను మరింతగా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరు అయినా కూడా గొడవలు వద్దనుకుని వదిలేస్తారు. కాని వివాదాన్ని అలా వదిలేస్తే ఆమె కంగనా ఎందుకు అవుతుంది. ఎప్పటి మాదిరిగానే మాటకు మాట అన్నట్లుగా కంగనా రెచ్చ పోయి వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.

నిన్న మహా ప్రభుత్వంను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన కంగనా ఈసారి ఏకంగా సీఎంను టార్గెట్ చేసింది. మీ నాన్న గారి మంచితనంతో మీకు సంపద వచ్చి ఉంటుంది. కాని మీ గౌరవంను మీరే సంపాదించుకోవాలి. మీరు నా నోరు మూయించగలరేమో కాని నాకోసం మాట్లడే నోర్లను మూయించలేరు కదా. మీరు నిజం నుండి తప్పించుకోవాలని ప్రయత్నించి రాజవంశంకు నమూనాగా నిలిచి పోయారు అంటూ ఆరోపించింది. కంగనా వ్యాఖ్యలతో రగిలి పోతున్న శివసేన కార్యకర్తలు ఏ క్షణంలో అయినా దాడి చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో కేంద్రం కంగనాకు వై కేటగిరి భద్రతను కేటాయించిన విషయం తెల్సిందే.