‘గాలి సంపత్’ కోసం దేవుళ్ళు దిగి వచ్చారు..!

0

యంగ్ హీరో శ్రీ విష్ణు – నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ”గాలి సంపత్”. ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. షైన్ స్క్రీన్స్ – ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ మిత్రుడు ఎస్. క్రిష్ణ (ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్) నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం ‘గాలి సంపత్’ అరకులో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్న రాజేంద్ర ప్రసాద్ – హీరో శ్రీ విష్ణు తో పాటూ సినిమాలో ముఖ్య తారాగణం మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుందని.. ఇది పూర్తైన తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే విడుదల చేసిన ‘గాలి సంపత్’ కాన్సెప్ట్ పోస్టర్ సినిమా మీద మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక డిఫరెంట్ ఎమోషన్ తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో బ్యూటిఫుల్ జర్నీ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

‘గాలి సంపత్’ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఎస్. క్రిష్ణ స్టోరీ అందిస్తున్న ఈ చిత్రానికి మిర్చి కిరణ్ సంభాషణలు రాస్తున్నారు. లవ్ లీ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి – సత్య – రఘుబాబు – శ్రీకాంత్ అయ్యంగార్ – మిర్చి కిరణ్ – సురేంద్ర రెడ్డి – గగన్ – మిమ్స్ మధు – అనీష్ కురువిల్లా – రజిత – కరాటే కళ్యాణి – సాయి శ్రీనివాస్ – రూప లక్ష్మి తదితరులు నటించనున్నారు.