కేజీఎఫ్ 2 కోసం వచ్చిన దత్

0

కేజీఎఫ్ 2 షూటింగ్ మెజార్టీ పార్ట్ హైదరాబాద్ లో జరిగింది.. ప్రస్తుతం కూడా ఇక్కడే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. గత నెలలో యశ్ మరియు కీలక నటీనటులపై హైదరాబాద్ లో చిత్రీకరణ జరిపారు. తాజాగా మరోసారి కేజీఎఫ్ 2 చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఇప్పటికే సంజయ్ దత్ హైదరాబాద్ చేరుకున్నాడు. క్యాన్సర్ ను జయించిన ఆయన తిరిగి వరుసగా సినిమాల్లో నటించడం పట్ల ఆయన అభిమానులు ఆనందంగా ఉన్నారు.

కేజీఎఫ్ చివరి షెడ్యూల్ ను వచ్చే నెల రెండవ వారం వరకు కొనసాగించబోతున్నారు. అంటే మొత్తం రెండు లేదా మూడు వారాల పాటు ఇక్కడే సంజయ్ దత్ షూటింగ్ లో పాల్గొంటాడు. దత్ తో పాటు యశ్ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ సినిమా వచ్చే నెల చివరితో షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

కన్నడంలో రూపొందుతున్న ఈ సినిమాపై తెలుగు మరియు హిందీ ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాను విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. థియేటర్ల పునః ప్రారంభంను బట్టి కేజీఎఫ్ 2 విడుదల ఉంటుందని అంటున్నారు.