బిబి : గీత భర్త అత్యుత్సాహం

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో సందడి చేసిన గీతా మాధురి ఫైనల్ వరకు వెళ్లింది. అక్కడ కౌశల్ ఆమెపై విజేతగా నిలిచాడు. ఇక అతి త్వరలో సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. ఈసారి గీత భర్త నందు కంటెస్టెంట్ గా వెళ్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఆయన ఇన్ స్టా గ్రామ్ లో చేసిన పోస్ట్ చర్చనీయాంశం అయ్యింది. డార్లింగ్ నేను బిబి లో ఉండబోతున్నాను. బిబి లో మనం చేసే రచ్చ మామూలుగా ఉండదు. మీ కోసం చాలా వినోదం రెడీ ఉండబోతుంది అంటూ రేపు సాయంత్రం ఆరు గంటలకు పూర్తి వివరాలు తెలియజేస్తానంటూ పేర్కొన్నాడు.

నందు చేసిన ఈ ప్రకటన బిగ్ బాస్ గురించి అని చాలా మంది అనుకుంటున్నారు. ప్రస్తుతం సమయంలో బిబి అంటే ప్రేక్షకులు మరో విషయ్యాన్ని ఆలోచించే అవకాశం కూడా లేదు. అందుకే నందు బిబి ఎంట్రీ అనేది బిగ్ బాస్ గురించే అనుకుంటున్నారు. కాని మాకు అందిన సమాచారం ప్రకారం అయితే నందు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడం లేదు. ఒక వేళ నిజంగా నందు ఎంట్రీ ఇచ్చేది నిజం అయితే ఇలా బాహాటంగా చెప్పడం ఉండదు. అలా చెప్తే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఎలిమినేట్ చేస్తారు.

ప్రస్తుతం కంటెస్టెంట్స్ అంతా కూడా పార్క్ హయత్ లో క్వారెంటైన్ లో ఉన్నారు. వారి వద్ద ఫోన్ లు ఉన్నాయా లేదా అనేది తెలియదు. కనుక నందు ఈ పోస్ట్ పెట్టాడు కనుక ఆయన బిబి అన్నది బిగ్ బాస్ అయ్యి ఉండదు అంటున్నారు. ఏదైనా బుల్లి తెర షో లేదా మరేదైనా అయ్యి ఉంటుందని అనిపిస్తుంది. త్వరలో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. అందులో కామెంట్రీ చెప్పే అవకాశం నందుకు వస్తుంది. కనుక నందు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు.