ఆదిపురుష్ 3డిలో సీతగా కియరా అద్వాణీ

0

డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా `తానాజీ` ఫేం ఓం రౌత్ `ఆదిపురుష్ 3డి` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం దాదాపు 500 కోట్ల మేర బడ్జెట్ ని టీసిరీస్ ఖర్చు చేయనుంది. పురాణేతిహాసం రామాయణ కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారని ప్రచారమవుతోంది.

అంతేకాదు.. ఈ మూవీలో సీతా దేవి పాత్రలో ఎవరు నటిస్తారు? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఓం రౌత్ కీలక పాత్రలకు నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రకు సైఫ్ అలీఖాన్ ని ఎంపిక చేసుకోగా.. పలువురు బాలీవుడ్ నటులకు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.

అంతేకాదు సీతాదేవి పాత్రకు కియరా అద్వాణీ పేరును పరిశీలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఆ పాత్రకు తను సూటబులేనా? అంటే.. ఇదిగో ఈ రూపం చూస్తే `ఎస్` అనకుండా ఉండలేరు. నిలువెత్తు బుట్టబొమ్మ తీరైన రూపం ఆకట్టుకుంటోంది. ఇక సంప్రదాయ చీరకట్టులో సీతాదేవినే తలపిస్తుంది కియరా. మోడ్రన్ ఔట్ ఫిట్ కి ఎంతగా సూటవుతుందో ఇటు ట్రెడిషనల్ లుక్ కి అంతే యాప్ట్ గా ఉంటుంది. అందుకే కియరాకు ఆ పాత్ర సూటబుల్ అని భావిస్తున్నారట. ఇక ప్రభాస్ -నాగ్ అశ్విన్ మూవీలో నటిస్తున్న దీపిక పదుకొనే సైతం ట్రెడిషనల్ లుక్ కి బాగా సూటవుతుందని పద్మావత్ 3డి చూసాక అందరూ అంగీకరించారు. భాజీరావ్ మస్తానీ సహా పద్మావత్ 3డిలో రాణి పాత్రలో దీపిక అదరగొట్టింది. అందుకే సీతగానూ తను యాప్ట్ అన్న చర్చా సాగుతోంది. ఒకవేళ ప్రభాస్ వరుసగా రెండో ఛాన్స్ తనకే ఇస్తే బెటర్ ఆప్షనే అవుతుంది.