పూరీకి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చిన బాలయ్య !?

0

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడంలో తనకు సాటి లేరని నిరూపించుకున్నాడు. సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకు అందరితో సినిమాలు తీసి వారి కెరీర్లో డిఫెరెంట్ మూవీ అనిపించుకునే సినిమాలు అందించాడు. పక్కా మాస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన పూరీ.. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో ‘పైసా వసూల్’ అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో డిఫరెంట్ మూవీగా తెరకెక్కిన ‘పైసా వసూల్’ బాక్సాఫీస్ దగ్గర పైసలు వసూలు చేయలేకపోయినా బాలయ్యను కొత్తగా ప్రజెంట్ చేసింది. అందుకే ఇప్పుడు పూరీ జగన్నాథ్ కి బాలయ్య పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.

కాగా నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పూరీ దర్శకత్వంలో ఓ మూవీ చేయాలని భావించిన బాలయ్య.. ఇప్పటికే పూరీని ఓ స్టోరీ రెడీ చేయమని కోరాడట. స్టోరీ రెడీ చేయడమే తరువాయి వెంటనే షూట్ కి వచ్చేస్తానంటూ బాలయ్య వర్తమానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న పూరీ.. నందమూరి హీరో కోసం స్టోరీ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. విజయ్ మూవీ కంప్లీట్ అయిన తరువాత పూరీ జగన్నాథ్.. బాలయ్యతో సినిమా చేయడం ఖాయంగానే కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి ఈసారైనా వీరి కాంబో పైసలు వసూలు చేస్తుందేమో చూడాలి.