‘సర్కారు వారి పాట’ అతడికి 100వ సినిమా

0

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలోని కీలకమైన సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరించబోతున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి. కాని కరోనా కారణంగా షూటింగ్ ను మొత్తం ఇండియాలోనే చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ సమయంలో షూటింగ్ కోసం అంటూ అమెరికా వెళ్లడం ఏమాత్రం కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కాని మహేష్ బాబు సర్కారు వారి పాటను అమెరికాలో చిత్రీకరించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అమెరికాలో తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలకు కోఆర్డినేటర్ కమ్ లైన్ ప్రొడ్యూసర్ గా చేసిన గోపీకృష్ణ నర్రావుల సర్కారు వారి పాట సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నాడు అంటూ స్వయంగా మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

అమెరికాలో షూటింగ్ జరిగిన సినిమాల్లో 99 సినిమాలకు ఈయన లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అల వైకుంఠపురంలో సినిమా లైన్ ప్రొడ్యూసర్గా గోపీకృష్ణ కు 99వ సినిమా కాగా ‘సర్కారు వారి పాట’ ఆయనకు వందవ సినిమా అవ్వనుంది. వందవ సినిమాకు ఆల్ ది బెస్ట్ అంటూ హాసిని అండ్ హారిక ప్రొడక్షన్ టీం గోపీకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బాబు కూడా గోపీకృష్ణ తో అమెరికాలో వర్క్ చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

1988లో బజార్ రౌడీ సినిమాతో ఆయన ఆయన కెరీర్ ప్రారంభం అయ్యింది. ఆ సినిమాలో నటించాను. మళ్లీ ఇప్పుడు నేను చేస్తున్న సర్కారు వారి పాట సినిమా ఆయనకు వందవ సినిమా అవ్వడం నిజంగా గ్రేట్. కష్టపడి పని చేసే మీరు మరిన్ని సినిమాలకు వర్క్ చేయాలని కోరుకుంటున్నాను అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. మహేష్ ట్వీట్ తో సర్కారు వారి పాట సినిమా అమెరికాలో షూటింగ్ జరుపుకోబోతుందని క్లారిటీ వచ్చేసింది.