‘ఆదిపురుష్’ కు బాహుబలి కంపోజర్

0

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ 3డి మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో టెక్నీషియన్స్ ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ సభ్యుల మద్య చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అనే విషయంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సౌత్ మరియు నార్త్ ప్రేక్షకుల అభిరుచి తెలిసిన సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ను ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా చేయించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా ముంబయి వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకు రహమాన్ కాకుండా కీరవాణితో సంగీతాన్ని చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఆస్కార్ విన్నర్ రహమాన్ తో ఆదిపురుష్ కు సంగీతాన్ని ఇప్పిస్తే సినిమా స్థాయి పెరుగుతుందని అంతా అనుకున్నారు. అయితే బాహుబలి సినిమాకు వర్క్ చేసిన కీరవాణి కూడా ఆదిపురుష్ కు ఖచ్చితంగా అద్బుతమైన ట్యూన్స్ ఇవ్వడం ఖాయంగా ఓం రౌత్ నమ్మకంగా ఉన్నాడు. తప్పకుండా కీరవాణి నుండి ఆదిపురుష్ కు మంచి పాటలు మరియు బీజీ వస్తుందని ప్రభాస్ కూడా భావించాడట. ఓం రౌత్ కు కీరవాణి పేరును సిఫార్సు చేసింది ప్రభాస్ అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది.