యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మరో హాలీవుడ్ సాంగ్..!

0

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడాది మొత్తం బిజీగా గడిపే జీవీ ఈ మధ్య ‘ఆకాశం నీ హద్దురా’ ఆల్బమ్ తో ప్రేక్షకులను పలకరించాడు. దీపావళి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తో స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా జీవీ ప్రకాష్ అందించిన మ్యూజిక్ మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలా విజయవంతమైన మ్యూజికల్ జర్నీ కొనసాగిస్తున్న జీవీ.. ఇప్పుడు ఇంగ్లీష్ మ్యూజిక్ ఆల్బమ్ తో హాలీవుడ్ సంగీత ప్రియులను కూడా అలరించడానికి సిద్ధమయ్యాడు.

ఇటీవల జీవీ ప్రకాష్ కుమార్ ”గోల్డ్ నైట్స్” పేరుతో ఒక ఇంగ్లీష్ ఆల్బమ్ ను రూపొందించారు. ఇప్పటికే అందులోని ఫస్ట్ సింగిల్ ‘హై అండ్ డ్రై’ అనే పాటను గత సెప్టెంబర్ 17న విడుదల చేయగా యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇదే క్రమంలో ఇప్పుడు మరో సాంగ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఈ హాలీవుడ్ ఆల్బమ్ నుంచి ‘క్రయింగ్ అవుట్’’ అనే పాటను నవంబర్ 19న స్టార్ హీరో ధనుష్ చేతుల మీదగా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను జీవీ ప్రకాష్ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశాడు. జీవీ ఈ పాటను కెనడాకు చెందిన జూలియా గర్దాతో కలిసి ఆలపించారు.