అక్కినేని ఫ్యాన్స్కు నాగ చైతన్య దీపావళి కానుక

0

కూల్ అండ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్త చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిదాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సాయిపల్లవి.. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగచైతన్యతో ‘లవ్స్టోరీ’ అనే సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అదిరిపోయే కాంబో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఎంతో కష్టపడి ఈ సినిమాకు కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు. అన్ని అనుకున్నట్టు జరిగితే గత వేసవిలోనే సినిమా విడుదలయ్యేది. కానీ కరోనా లాక్డౌన్ దెబ్బకు సినిమా ఆగిపోయింది. చివరకు లాక్డౌన్ నిబంధనలు పూర్తయ్యాక షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తయినట్టు సమాచారం. కానీ ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సాంగ్ పోస్టర్లు ఫుల్ వైరల్ అయ్యాయి.

తాజాగా దీపావళి సందర్భంగా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ కొత్త పోస్టర్లో నాగ చైతన్య సాయి పల్లవి పెళ్లి పీటలెక్కినట్టు కనిపిస్తోంది. అంటే సినిమాలోఈ ఇద్దరి కథ సుఖాంతం కానుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరి జంట మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని చెబుతూ నాగ చైతన్య ఈ కొత్త పోస్టర్ను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ మూవీని ఏసియన్ అధినేత సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తారా? లేదంటే ఓటీటీలో రిజీజ్ చేస్తారో వేచిచూడాలి. అయితే భారీ కాంబో కాబట్టి థియేటర్లో రిలీజ్ చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది.