5 ఏళ్లలో చిన్నపాప కాస్త హీరోయిన్ లా మారిందే

0

సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీ భజరంగీ భాయిజాన్ సినిమాలో పాకిస్తాన్ నుండి వచ్చి సల్మాన్ కు దొరికే పాప గుర్తు ఉంది కదా. ఆ సినిమాలో చిన్న పాపగా ముద్దులు ఒలికే పాపగా కనిపించింది. ఆరు ఏడు ఏళ్ల వయసులో ఆ సినిమాలో నటించిన ఆ పాప పేరు హర్షాలీ మల్హోత్రా. సినిమాలో మున్నీ పేరుతో ఫేమస్ అయిన ఆ పాప తాజా సోషల్ మీడియా పోస్ట్ లు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 2015లో సల్మాన్ ఖాన్ సినిమాలో చిన్న పాపగా కనిపించిన మున్నీ ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది.

అసలు ఆ పాప ఈమెనా అన్నట్లుగా మారిపోయిన మున్సీని చాలా మంది హీరోయిన్గా పరిచయం చేయాలనుకుంటున్నారు. అయితే మున్నీ వయసు కేవలం 12 ఏళ్లు మాత్రమే. కనుక ఆమె హీరోయిన్ గా పరిచయం అవ్వాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. ఉత్తరాది అమ్మాయిలు చిన్న వయసులోనే పెద్దగా కనిపిస్తూ ఉంటారు.

చాలా మంది హీరోయిన్స్ కూడా 15 ఏళ్ల లోపులోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒక వేళ హర్షాలీ కి హీరోయిన్ గా చేయాలనే ఆసక్తి ఉంటే మాత్రం తప్పకుండా మెకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని ఈ ఫొటోలు చూస్తుంటే అనిపిస్తుంది. ముందు ముందు సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించినా ఆశ్చర్య పోనక్కర్లేదు.