KGF స్టార్ యష్… కూతురి ఫన్ చూశారా.. ఐస్ క్రీమ్ కిలాడీ..!

0

KGF 2 స్టార్ యష్ ఎంత పెద్ద స్టారో అంత గొప్ప ఫ్యామిలీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన కుమార్తె ఐరా అల్లరి వేషాలు చూశారా? ఈ క్యూటీ ఐస్ క్రీమ్ అంటూ ఎలా ఊరిస్తోందో డాడ్ ని?… ఇలా నోటికి అందించినట్టే అందించి అలా గుటుక్కుమనిపిస్తోంది. ఐరా చిలిపి వేషాలు ప్రస్తుతం అభిమానుల్లో వైరల్ గా మారాయి. డాడీ బిజీ లైఫ్ ఒత్తిడికి భలేగా వైద్యం చేస్తోంది ఈ అల్లరి పిడుగు అంటూ కితాబిచ్చేస్తున్నారు.

రాకింగ్ స్టార్ యష్ ఇటీవల తన కుమార్తె ఐస్ క్రీం ఎంజాయ్ చేస్తున్న వీడియోను స్వయంగా షేర్ చేసారు. చూడగానే ముఖంలో చిరునవ్వు ఖాయం. ఐరా చిలిపి వేషాలు ఆ రేంజులోనే కనెక్టయిపోతున్నాయి. యష్ గురించి చెప్పాల్సి వస్తే అతడు కెరీర్ పరంగా హీరోగా ఎంత బిజీనో అంతగా పక్కా ఫ్యామిలీ మ్యాన్. తన బిజీ షెడ్యూల్ మధ్య తన భార్యా పిల్లల కోసం కొంత సమయం కేటాయిస్తాడు. యష్ అతని భార్య రాధిక పండిట్ తమ మొదటి బిడ్డ ఐరాను కెమెరా గ్లిజ్ నుండి దూరంగా ఉంచేందుకే ఇష్టపడతారు. ఇక టాలీవుడ్ లో అయితే ఈ తరహా వేషాల్లో బన్ని కుమార్తె అర్హ.. మహేష్ డాటర్ సితార ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్ అనే చెప్పాలి.

యష్ – రాధిక పండిట్ జంటకు 2018 డిసెంబర్ 2 న ఐరా పండిట్ జన్మించింది. 2019 అక్టోబర్ 30 న వారు తమ రెండవ బిడ్డ పసికందుకు స్వాగతం పలికారు. యథర్వ్ తన పేరు. యష్ లో వై.. రాధికలో ఆర్ కలిసేలా ఈ పేరును పెట్టుకున్నారట.

 

View this post on Instagram

 

Sharing is caring… not when it comes to ICE CREAM 😜 (Getting a dose of my own medicine here 😄)

A post shared by Yash (@thenameisyash) on