రేస్ బైక్ మీద హీరో నవదీప్ అడ్వెంచర్

0

హిమాలయాల్లో అడ్వెంచర్ కి వెళుతున్నా అంటూ యంగ్ హీరో నవదీప్ ఇంతకుముందే టీజర్ వదిలాడు. వామ్మోవ్ వేల అడుగుల ఎత్తున మంచు కొండల్లో మైనస్ డిగ్రీ చలిలో అత్యంత సాహసోపేతమైన ట్రిప్ కి వెళ్లాడు అంటూ అంతా కంగారు పడ్డారు.

పైగా రోడ్ అంచునుంచి చూస్తే లోయలు జలపాతాలు కళ్లు తిరిగిపోతాయి. అలాంటి చోట బైక్ పై సాహసాలు అంటే ఆషామాషీనా? అంటూ ఒకటే ఇదైపోయారు. మనాలి.. సిమ్లా లాంటి ఎంట్రాన్స్ ప్రాంతాలే సుమారు 18000 అడుగుల ఎత్తున ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా హిమాలయ పర్వత సానువుల అంచులకు వెళ్లిపోతున్నాడు నవదీప్.

ఇప్పుడు మరో సాహసానికి సంబంధించిన వీడియో ని రివీల్ చేశాడు. ఇది రేస్ బైక్ అడ్వెంచర్. రేస్ బైక్ పై స్లైడింగ్ చేస్తూ సాహసవీరుడిలా తనని తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. స్లైడింగ్ థ్రూ లైఫ్ బీ లైక్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. స్మూత్ గా చేసేస్తున్నా అని చెబుతున్నాడు. అయితే అదేమీ స్మూత్ గా కనిపించడం లేదు సరికదా చాలా రిస్కీగానే ఉంది. అసలు నవదీప్ సాహసాలు చూస్తుంటే ఎవరైనా షాక్ తినాల్సిందే. సినిమాల పరంగా వెనకబడినా టీవీ రియాలిటీ షోలతో నవదీప్ ఫుల్ బిజీగా ఉన్నాడు. జడ్జీగా .. హోస్ట్ గా రాణిస్తున్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో.

 

View this post on Instagram

 

Sliding through life be like…. #smooooooothga

A post shared by Nav Deep 2.0 (@pnavdeep) on