దీపావళి మిడ్ నైట్ దబిడ దిబిడే అంటోంది

0

పండగొస్తోందంటే ఎవరి ప్లాన్స్ వారికి ఉంటాయి. తమ అభిమానుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు ఏదో ఒకటి చేయాలి కదా? అందుకే సీనియర్ నాయికలతో పాటు నవతరం నాయికలు సామాజిక మాధ్యమాల్ని ఆలంబనగా చేసుకుని చెలరేగుతున్నారు. పండగకు చాలా ముందే అదిరిపోయే ఫోటోషూట్లతో ట్రీటిస్తున్నారు. కొందరైతే యూట్యూబ్ చానెళ్లు ప్రారంభించి మరీ చెలరేగుతున్నారు. ఇదే కోవకు చెందుతుంది మోడల్ కం నటి సాక్షి మాలిక్.

దీపావళి సందడికి టైమొచ్చింది. ఏదో ఒకటి చేయాలి. శరీరంలో అవాంఛిత కొవ్వు పెంచే సీజన్ ఇది. మీరు స్వీట్లు తినొద్దు అని చెప్పలేరు.. స్వీట్లు తినకుండా ఉండగలరా అయినా?

సరే తినండి ఏం చేస్తాం? మీతో ఒక మంచి శుభవార్తను షేర్ చేస్తున్నా. దీపావళి తరువాత అంటే 15 నవంబర్ 2020.. 12PM కి నేను నా మొదటి యూట్యూబ్ వీడియోను పోస్ట్ చేస్తాను. ఇది నా యూట్యూబ్ ఛానెల్ ఆరంభమయ్యే సీజన్. నేను చాలా ఫిట్ నెస్ సంబంధిత కంటెంట్ ను పోస్ట్ చేస్తాను. మిమ్మల్ని అంటే అమ్మాయిలు అబ్బాయిలను ఆరోగ్యంగా ఫిట్ గా మార్చడానికి ప్రయత్నిస్తాను.

అప్పటి వరకు.. పండుగ ప్రకంపనలను ఆస్వాధించండి. ఎందుకంటే ఇది ప్రస్తుత సంవత్సరంలో ఏం జరుగుతుందో మనం మరచిపోయి.. తదుపరి సరికొత్త ప్రారంభాన్ని ఇవ్వవచ్చు. మీ అందరినీ ప్రేమిస్తున్నాను..నా మొదటి వీడియోను భాగస్వామ్యం చేయడానికి వేచి ఉండలేను !! అంటూ ఎంతో ఎగ్జయిట్ అవుతోంది సాక్షి మాలిక్. తాజాగా తన యూట్యూబ్ చానల్ కి సంబంధించి ప్రివ్యూని ప్రదర్శిస్తూ యూట్యూబ్ లింక్ ని షేర్ చేసింది ఇన్ స్టాలో.

ఈ అమ్మడు పాపులర్ మోడల్. పలు బ్రాండ్లకు మోడలింగ్ చేసి ఆకట్టుకుంది. మారుతి ఆటో ఎక్స్ పో-2020 వేదికపై బ్రాండ్ అంబాసిడర్ గా ర్యాంప్ పై మెరుపులు మెరిపించింది. ఆటో ఎక్స్ పో 2020 వేదిక షేక్ అయ్యింది. ఆ తర్వాత సినీరంగంపైనా ఆసక్తిని కనబరిచింది. కథానాయికగా వెలిగిపోవాలని కలలు గంటోంది. మరి పిలిచి ఛాన్స్ ఇచ్చేదెవరో? ప్రస్తుతం ఇన్ స్టా వేదికగా చెలరేగుతున్న సాక్షి త్వరలో యూట్యూబ్ చానెల్లో ఫిట్నెస్ క్లాసులతో అభిమానుల్ని పెంచుకోవాలని ఆశిస్తోంది..