వింక్ గాళ్ తో రొమాన్సా.. జాక్ పాట్ కొట్టాడే!

0

వింక్ సంచలనం ప్రియా ప్రకాష్ వారియర్ ఆరంగేట్రం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఓవర్ నైట్ సంచలనంగా ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించిన యువనాయికగా పాపులరైంది. సోషల్ మీడియాల్లో లక్షలాదిగా లవ్ ప్రపోజల్స్ అందుకున్న యంగ్ బ్యూటీగానూ సుపరిచితమే.

వింక్ బ్యూటీ ప్రతిభకు బ్రిలియన్సీకి మెచ్చి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా `ఒరు ఆధార్ లవ్` తెలుగు వెర్షన్ కి ప్రమోషన్ చేశారు. ఆ తర్వాత బన్ని ఆఫర్ ఇస్తారని ప్రచారమైంది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం ప్రియా యూత్ స్టార్ నితిన్ సరసన నటిస్తోంది. వెటరన్ చంద్రశేఖర్ ఏలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం… యువ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించనున్న మరో చిత్రానికి ప్రియా సంతకం చేసింది. మలయాళ హిట్ `ఇష్క్` కి తెలుగు రీమేక్ ఇది. ఈ చిత్రానికి డెబ్యూ నాగరాజు దర్శకత్వం వహించనున్నారు.

తేజ సజ్జా బాలనటుడగా పాపులర్. ఇటీవల సమంత ఓ బేబిలోనూ ప్రధాన పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తేజ- ప్రియా ప్రకాష్ జోడీ క్రేజును తెస్తుందనడంలో సందేహమేం లేదు.