భర్త పై ప్రేమను బయటపెట్టిన హీరో భార్య..!!

0

టాలీవుడ్ హీరో రానా పెళ్లి వేడుక ఇటీవలే ముగిసింది. తన ప్రేయసి మిహీక బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసి ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నాడు రానా. లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మించిన రామానాయుడు స్టూడియోలో కొద్దిమంది సన్నిహితుల మధ్య ఆగస్టు 8న ఈ వివాహం జరిగింది. ఇక ఈ ప్రేమికుల పెళ్ళికి సినీహీరోలు రాంచరణ్ అల్లు అర్జున్ లతో పాటు కొద్దిమంది మాత్రమే ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఈ పెళ్లివేడుకలో అక్కినేని కుటుంబం నుండి నాగచైతన్య సమంతలు సమంత ప్రత్యేకంగా నిలిచారు. నాగచైతన్య భార్యగా సమంతకు దగ్గుబాటి కుటుంబంతో బంధం ఏర్పడింది. ఇక పెళ్ళిలో సమంత చక్కగా చీరలో హాజరయ్యింది. అయితే తాజాగా రానా – మిహికల పెళ్లిలో కుటుంబ సభ్యులతో సమంత కూడా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యామిలీ ఫోటో షేర్ చేసి.. పెళ్లికూతురు మిహికకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. సమంత పోస్ట్ చేస్తూ.. ‘అందమైన మిహికా.. కుటుంబంలోకి నీకు స్వాగతం’ అని ఆహ్వానించింది. ఇదిలా ఉండగా.. తాజాగా రానా భార్య మిహిక తన భర్తను ఉద్దేశించి ఓ లవ్ నోట్ పోస్ట్ చేసింది. “నా లవ్.. నా లైఫ్.. నా హార్ట్.. నా సోల్.. నా సర్వస్వం నువ్వే. నేనెప్పుడూ కలలో కూడా ఇది ఊహించలేదు. నన్ను మరింత మెరుగైన వ్యక్తిగా మలిచావు. ఐ లవ్ యూ!” అంటూ మిహికా తన భర్త రానా పై ప్రేమను చాటుకుంది. తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఈ మేరకు క్యాప్షన్ జతచేసింది. ఈ దంపతులు ఇటీవలే సత్యనారాయణ వ్రతం కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.