శర్వా చేసుకోబోతున్న ఆ లక్కీ లేడీ ఎవరు?

0

యంగ్ హీరో శర్వానంద్ ప్రేమ పెళ్లికి రెడీ అవుతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. శర్వా చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అనే విషయంలో ఆయన కుటుంబం నుండి ఇప్పటి వరకు ఎలాంటి హింట్ రాలేదు. అయితే కొందరు మాత్రం ఉపాసన కుటుంబంకు చెందిన అమ్మాయి అంటున్నారు. ఆ విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. పెళ్లికి రెడీ అవుతున్న శర్వా గత కొన్నాళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నాడట. ఈ విషయం గురించి ఇండస్ట్రీలో చర్చ బాగా జరుగుతుంది.

ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ను కలిగి ఉన్న శర్వానంద్ ఎంత మంచి అమ్మాయిని.. ఎంత అందమైన అమ్మాయిని చేసుకుంటున్నాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా శర్వా చేసుకునే అమ్మాయి లక్కీ అయ్యి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో మంచి పేరున్న శర్వా సినిమాలతో కూడా మంచి స్టార్ డం దక్కించుకున్నాడు. కెరీర్ పరంగా వ్యక్తిగతంగా కూడా మంచి పేరున్న శర్వానంద్ ను చేసుకోబోతుంది అంటే ఆ అమ్మాయి చాలా లక్కీ. ఆ లక్కీ లేడీని ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి శర్వా ఆమె పేరును ఎప్పుడు రివీల్ చేస్తాడు అనేది చూడాలి.