ప్రభాస్ ఆ గుడ్ న్యూస్ కూడా చెప్తే బాగుంటుంది కదా…!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కరోనా సమయంలో కూడా వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఇదే క్రమంలో ”ఆదిపురుష్” అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లు ప్రకటించారు. డార్లింగ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఇలాంటి అప్డేట్స్ తో ప్రభాస్ ఆయన ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అయితే డార్లింగ్ సక్సెస్ ఫుల్ కెరీర్ చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నప్పటికీ.. వారికి ప్రభాస్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి కాస్త నిరాశ చెందుతున్నారట. అందుకే ప్రభాస్ నుంచి మూవీ అప్డేట్స్ తో పాటు మరో గుడ్ న్యూస్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

కాగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఓవైపు కరోనా అని కంగారు పడుతున్నా.. మరోవైపు దొరికిన ఖాళీ సమయాన్ని కెరీర్ లో ముఖ్య ఘట్టాలకు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో యువ హీరోలు నిఖిల్ – నితిన్ లు తమ ప్రియురాళ్లను వివాహం చేసుకున్నారు. ఇదే క్రమంలో బాహుబలి బ్రదర్ భల్లాలదేవ దగ్గుబాటి రానా కూడా ఓ ఇంటివాడయ్యాడు. ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తల్లో నిలిచిన మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇక శర్వానంద్ కూడా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు పదుల వయసు మీద పడిన ప్రభాస్ కూడా పెళ్ళి న్యూస్ చెప్తే డబుల్ హ్యాపీగా ఉంటామని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే దాదాపు అందరు పెళ్లీడు హీరోలకి పెళ్లిళ్లు జరిగిపోయిన నేపథ్యంలో టాలీవుడ్ సల్మాన్ ఖాన్ అని అనిపించుకోకుండా ప్రభాస్ కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలని డార్లింగ్ అభిమానులు కోరుకుంటున్నారు.