ఫైటర్ కి ముప్పు తెచ్చి పెట్టిన నటవారసురాలు!

0

నచ్చకపోతే డిస్ లైక్ కొట్టు గురూ.. పగ ప్రతీకారం తీర్చేసుకో! ఇదీ డిజిటల్లో సరికొత్త ట్రెండ్. గూగుల్ లో ఎంతగా డిస్ లైక్స్ కొడితే అంతగా ఆ స్టార్లు అంటే యావగింపు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ అంతకంతకు వేడెక్కిస్తోంది.

ఇటీవలే ఆలియా భట్ కి ఈ టైప్ లో కోటింగ్ పడింది. దీంతో ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ కంగారు పడ్డారు. ఇంతలోనే ఆర్.ఆర్.ఆర్ నుంచి ఆలియా తప్పుకుందన్న ప్రచారంతో చరణ్.. ఎన్టీఆర్ అభిమానులు హమ్మయ్య అనుకున్నారు.

ఆలియా నటించిన `సడక్ 2` ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు సంఖ్యలో డిస్ లైక్స్ తో సంచలనం సృష్టించింది. నటవారసురాలిపై జనాలకు ఇంత మంట ఉందా? అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. పైగా సుశాంత్ సింగ్ కేసులో ఈ నటవారసురాలిని ఆడుకుంటున్నారు అతడి అభిమానులు.

ఇప్పుడు మరో స్టార్ కిడ్ అనన్య పాండేకి కూడా అదే తీరుగా ట్రీట్ ఇస్తున్నారు సుశాంత్ ఫ్యాన్స్. అనన్య తండ్రి చుంకీ పాండే సరదాగా తాను స్టార్ ని కాదని జోకేసారు. పైగా తన వారసురాలిని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ చూపించినా.. సుశాంత్ ఫ్యాన్స్ నుంచి హీట్ మాత్రం ఎదుర్కోవాల్సి వస్తోంది. పాండేకి ఒకరకంగా పంచనామా చేస్తున్నారు సుశాంత్ ఫ్యాన్స్.

అనన్య పాండే నటించిన తాజా కొత్త చిత్రం ఖలీ పీలీ ట్రైలర్ రెండు రోజుల క్రితం విడుదల కాగా.. దీనికి యూట్యూబ్లో 1.5 మిలియన్ డిస్ లైక్స్ జమ అయ్యాయి. అంటే అనన్య నటించే ప్రతి సినిమాకి ఈ ఇబ్బంది తప్పదనే దీనర్థం. ప్రస్తుతం రౌడీ విజయ్ దేవరకొండ సరసన ఫైటర్ చిత్రంలో నటిస్తోంది. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేయాలన్న ప్లాన్ కి చెక్ పెట్టేసేలా నటవారసురాలికి పంచ్ పడుతుందేమో.. అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.