హీరోయిన్స్ కు దక్కని బెయిల్

0

కన్నడ హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజన గర్లానీలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. పోలీసుల వద్ద కీలక ఆధారాలు ఉండటం వల్ల వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లుగా మీడియాలో కథనాలు ఉన్నాయి. వారి విచారణ మరియు అరెస్ట్ కు సంబంధించిన వీడియోలు లీక్ అవ్వడంపై ఇప్పటికే సినీ వర్గాల వారు మరియు మహిళ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి కేసు ఇంకా నిర్థారణ అవ్వకుండానే ఎలా వారే దోషులు అంటూ వీడియోలు విడుదల చేస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. గత వారం అరెస్ట్ అయిన వీరిని బెయిల్ పై బయటకు తీసుకు వచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇద్దరు హీరోయిన్స్ కుటుంబ సభ్యులు కూడా బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే విచారణ అధికారులు వారిని ఇంకా ప్రశ్నించేది చాలా ఉంది. మరియు వారు బయటకు వెళ్తే సాక్ష్యులను ప్రభావింతం చేయడంతో పాటు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది అంటూ వాదించడంతో వారికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వారిద్దరు ఇప్పుడు జ్యుడీషయల్ కస్టడీలో ఉన్నారు. వారి నుండి మరింత సమాచారం రాబట్టేందుకు ఎంక్వౌరీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ఈ కేసుతో సంబంధం కలిగి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బెయిల్ కోసం వారు ఈనెల 24న జరుగబోతున్న తదుపరి విచారణ వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ రోజు అయినా హీరోయిన్స్ కు బెయిల్ వస్తుందా అనేది కన్ఫర్మ్ గా చెప్పలేని పరిస్థితి.