డ్రగ్స్ కేసులో దీపికాకు ఎన్ సీ బీ సమన్లు??

0

సుశాంత్ మృతి కేసు విచారణలో సీబీఐ కి డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు లభించడంతో రంగంలోకి ఎన్ సీ బీ దిగింది. ఇప్పటికే డ్రగ్స్ డీలర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన అనుమానంతో రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారు చెప్పిన వివరాల ప్రకారం బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు డ్రగ్స్ కేసులో నింధితులుగా ఉన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పలువురు బాలీవుడ్ స్టార్స్ కు ఎన్ సీ బీ నుండి నోటీసులు వెళ్లబోతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. అందులో భాగంగా మొదటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే కు ఎన్ సీ బీ విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయబోతున్నట్లుగా జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.

జాతీయ మీడియా కథనాల ప్రకారం డ్రగ్స్ రాకెట్ లో ఉన్న వ్యక్తులతో దీపిక కు సంబంధాలు ఉన్నాయని ఎన్ సీ బీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఇంకా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ కేసులో ఉన్నట్లుగా కూడా జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఎన్ సీ బీ నుండి మీడియా వర్గాలకు అందుతున్న లీక్స్ ప్రకారం ఇప్పుడు దీపిక పదుకునేకు సమన్లు పంపనున్నారట. ఈ కేసు విచారణ సమయంలో ఎవరిపై అయినా అనుమానం కలిగితే వెంటనే వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పెళ్లి అయిన తర్వాత కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న దీపిక పదుకునే ఇటీవలే ప్రభాస్ కు జోడీగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చ ఏడాది సమ్మర్ నుండి షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇలాంటి సమయంలో ఎన్ సీ బీ అధికారులు ఆమెకు సమన్లు పంపబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో సౌత్ లో కూడా ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.