డ్రగ్స్ కేసులో గుండెలదిరే నిజం తెలిసింది!

0

అటు బాలీవుడ్ ఇటు శాండల్ వుడ్ రెండు చోట్లా డ్రగ్స్ సిండికేట్ గుట్టు ఒకేసారి లీకవ్వడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా శాండల్ వుడ్ నాయికలు సంజన గల్రానీ- రాగిణి ద్వివేది నుంచి రకరకాలుగా సమాచారం రాబడుతున్నారు. ఈ భామలు డ్రగ్స్ కేసు వ్యవహారం బయటపడే క్రమంలో 100 మందికి సంబంధించిన సమాచారాన్ని ఫోన్ నుంచి తొలగించారని తెలుస్తోంది. ఇక ఆ వందమంది ఎవరు? అన్నదానిపైనా పోలీసులు ఆరాలు తీస్తున్నారు.

దీనిని బట్టి తీగ లాగితే చాలా ఇండస్ట్రీల లోగుట్టు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిశ్రమల మధ్య డ్రగ్స్ సరఫరా ఇంటర్ లింకులపైనా నార్కోటిక్స్ అధికారులు ఆరాలు తీస్తున్నారట. ఇక ఈ కేసులో మరో ఆసక్తికర ట్విస్టు బయటపడింది. అరెస్టు చేసే క్రమంలో సంజనను పోలీసులు అడిగిన ప్రశ్న `మీకు పెళ్లయిందా?` .. కానీ దానికి సంజన అవ్వలేదు అని చెప్పింది. అయితే గత ఏడాది అజీజ్ పాషా అనే తమిళ వైద్యుడిని సంజన రహస్య వివాహం చేసుకుందన్న నిజం బయటపడింది. ఆ ఇద్దరూ జంటగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాల్లో బయటపడడంతో ఖంగు తిన్న సంజన పోలీసుల ముందు నిజమేనని ఒప్పుకోవాల్సి వచ్చిందట.

ఇక డ్రగ్ డీలింగ్స్ పైనా పెడ్లర్ల గురించి ఆరాలు తీస్తున్నారట. తమతో సన్నిహితంగా ఉన్నవారు సహా నిందితుల గురించి సంజన.. రాగిణి కీలక సమాచారం తెలిపారట. ఈ డీలింగ్స్ లో డెబిట్.. క్రెడిట్ కార్డులు సహా బిట్ కాయిన్ల ద్వారా డ్రగ్స్ ని కొనుగోలు చేసినట్లు సీసీబీ పోలీసులు ఆధారాలను సేకరించారు. డార్క్ వెబ్లో డ్రగ్స్ సరఫరా చేసే ఆఫ్రికన్ ముఠాల వివరాల్ని ఆ ఇద్దరూ వెల్లడించారని తెలుస్తోంది. ఈ కేసలో రవిశంకర్- రాహుల్- వీరేన్ లతో ఆ ఇద్దరి సంబంధాలు బయటపడ్డాయి. ఇక ఒకే జైలులో ఉన్నా రాగిణి.. సంజనల మధ్య పొసగక పోవడంతో ఇద్దరికీ వేర్వేరు గదుల్ని ఎరేంజ్ చేయాల్సి వచ్చిందట. ఇక రాగిణి తల తిరుగుతోందని ఊపిరాడడం లేదని అనడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా తనకు బీపీతో పాటు గ్యాస్ట్రిక్ ఉందని తెలిసిందట. ప్రస్తుతం సంజన.. రాగిణిలకు రక్త పరీక్షల్ని నిర్వహించనున్నారు.