గంగవ్వకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే అత్యధికం

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 షురూ అయ్యింది. ఈసారి చాలా ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. చాలా రోజులుగా గంగవ్వ బిగ్ బాస్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. అది నిజమే అయితే రచ్చ రచ్చ అంటూ సోషల్ మీడియాలో మొదటి నుండి ప్రచారం చేస్తూ వచ్చారు. అన్నట్లుగానే సోషల్ మీడియాలో గంగవ్వ పేరు ఇప్పుడు మారు మ్రోగి పోతుంది. చాలా మంది కూడా మేము బిగ్ బాస్ చూడం. కాని ఎలిమినేషన్ కు గంగవ్వ నామినేట్ అయతే ఖచ్చితంగా ఆమెకు మద్దతుగా నిలుస్తామంటూ పోస్ట్ లు పెట్టిన వారు వేలల్లో ఉన్నారు.

ఈసారి బిగ్ బాస్ ను కేవలం గంగవ్వ కోసం చూడాలనుకుంటున్నట్లుగా కూడా వేలాది మంది సోషల్ మీడియాలో చెబుతున్నారు. గంగవ్వ హ్యాష్ ట్యాగ్ మొదటి రోజు జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యింది అంటే ఏ స్థాయిలో గంగవ్వకు గుర్తింపు దక్కించదో అర్థం చేసుకోవచ్చు. ఇక గంగవ్వ మొదటి వారంలోనే ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యింది. అందరు కూడా ఆమె నామినేట్ అయినా ఈజీగానే సేవ్ అవుతుంది కనుక నోయల్ ను సేవ్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పి ఆమెను నామినేట్ చేయడం జరిగింది. మొదటి వారంలోనే ఎలిమినేషన్ లో ఉండటంతో గంగవ్వ ఫాలోవర్స్ ఇప్పుడు భారీ ఎత్తున ఓట్లు గుద్దేస్తున్నారట. చాలా మంది సోషల్ మీడియాలో గంగవ్వకు ఓట్లు వేసి మరీ ఆ స్ర్కీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

గంగవ్వకు ఈసారి అత్యధికంగా ఓట్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఏ కంటెస్టెంట్ కు రానన్ని ఓట్లు గంగవ్వకు వస్తున్నట్లుగా ఇప్పటికే స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఖచ్చితంగా గంగవ్వ సేవ్ అవుతుంది.. అదే సమయంలో ఆమెకు రికార్డు స్థాయి ఓట్లు పడుతాయంటున్నారు. తదుపరి స్థానంలో నిలిచే వ్యక్తి కంటే లక్షల ఓట్లు ఎక్కువగా గంగవ్వకు వస్తాయని అంటున్నారు. వచ్చే శని ఆదివారాల్లో గంగవ్వకు వచ్చిన ఓట్లకు సంబంధించి నాగార్జున ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి.