బెంజ్ కారు ఎలా కొన్నావు అన్న ప్రశ్నకు నటి సీరియస్ రిప్లై

0

బుల్లి తెర నుండి మెల్లగా వెండి తెరపైకి వచ్చిన హిమజ ఈమద్య కాలంలో సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకుని ఏకంగా సోలో హీరోయిన్గా కూడా మారింది. తెలుగు బిగ్బాస్ ద్వారా అనూహ్యంగా స్టార్ డం దక్కించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియా.. బుల్లి తెర.. సినిమాలు ఇలా అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది. దాంతో ఆమె బెంజ్ కారు కొనుగోలు చేసింది. ఆమె బెంజ్ కారు కొనుగోలు చేసినప్పటి నుండి కూడా నెటిజన్స్ ఆమె కారుపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. బెంజ్ కొనేంత డబ్బు మీకు ఎక్కడిది అంటూ పదే పదే ప్రశ్నిస్తుండటంతో తాజాగా క్లారిటీ ఇచ్చింది.

స్కూల్ టీచర్ గా చేసిన నేను వచ్చిన ప్రతి ఒక్క అవకాశంను సద్వినియోగం చేసుకుంటూ కష్టపడుతూ ఇబ్బందులు పడుతూ ఈ స్థాయికి వచ్చాను. నటిగా బిజీగా ఉన్న నాకు బెంజ్ కంపెనీ వారు జీరో కాస్ట్ ఈఎంఐతో కారు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. నెలకు 50 వేల రూపాయల ఈఎంఐతో నేను బెంజ్ కారు కొనుగోలు చేశాను. ఇప్పటికి ప్రతి నెల 4వ తారీకున నేను ఈఎంఐ చెల్లిస్తున్నాను. నా కారు గురించి విమర్శలు చేసేవారు ఆ ఈఎంఐ మీరు ఏమైనా చెల్లిస్తారా అంటూ ప్రశ్నించింది. కష్టపడి సంపాదించుకున్న నన్ను కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినంత మాత్రాన బాధపడను అంటూ చెప్పుకొచ్చింది. ఈమె ‘జ’ అనే హర్రర్ థ్రిల్లర్ మూవీతో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.