మిస్ ఇండియా’ కోసం చాలా తగ్గాను

0

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఉత్తరాదిన కూడా మహానటి కారణంగా మంచి గుర్తింపును దక్కించుకుంది. అలాంటి కీర్తి సురేష్ వరుసగా కమర్షియల్ సినిమాలు చేయాలని భావించినా కూడా ఆమెకు వచ్చిన పాపులారిటీ మరియు గుర్తింపు కారణంగా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కథలు బాగుండటం వల్ల ఛాలెంజింగ్ రోల్స్ అవ్వడం వల్ల లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కీర్తి ఓకే చెబుతూ వచ్చింది. ఇప్పటికే ఓటీటీ ద్వారా పెంగ్విన్ సినిమాను విడుదల చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మిస్ ఇండియాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నవంబర్ 4న నెట్ ప్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విశేషాలను కీర్తి సురేష్ వెళ్లడించేందుకు మీడియా ముందుకు వచ్చింది.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మహానటి సినిమా తర్వాత నాకు బాధ్యత మరింత పెరిగింది. మిస్ ఇండియా సినిమా కోసం దర్శకుడు కాస్త బరువు తగ్గాలని సూచించారు. ఏ డ్రస్ వేసినా కూడా సూట్ అయ్యేలా బాడీ ఉండాలని దర్శకుడు నరేంద్రనాథ్ చెప్పిన సమయంలో వర్కౌట్ లు చేయడం మొదలు పెట్టాను. మహానటి పూర్తి అయినప్పటి నుండి బరువు తగ్గడం మొదలు పెట్టాను. ఇంత స్లిమ్ గా మారడానికి కారణం మిస్ ఇండియా సినిమానే. ఇదే వెయిట్ లుక్ ను మెయింటెన్ చేయమని చాలా మంది సలహా ఇస్తున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే ఒక సాదారణమైన మద్యతరగతి అమ్మాయి కోరికలు కలలు చాలా ఉన్నతంగా ఉంటాయి. వాటిని నెరవేర్చుకునేందుకు ఆమె పడ్డ శ్రమ మరియు చేసిన పోరాటమే ఈ సినిమా. అమెరికాలో ఇండియన్ కాఫీ కి మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడ కాఫీ బిజినెస్ పెట్టి ప్రత్యర్థులను తట్టుకుని నిలబడి విజేతగా నిలిచే ఒక సాదారణమైన అమ్మాయి పాత్రతో ఈ సినిమా రూపొందింది. ఒక మద్య తరగతి అమ్మాయి ఛాలెంజిగ్ జర్నీ మిస్ ఇండియా. ఈ సినిమా ఓటీటీ లో విడుదల అవ్వబోతుండటం సంతోషంగా ఉందని కీర్తి పేర్కొంది.