బాలయ్య సెట్స్ లో అడుగుపెట్టేది అప్పుడే..!

0

నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో బిబి3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే ఈ మధ్యే కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ తిరిగి షూటింగ్ ప్రారంభించారు. బాలయ్య మాత్రం నవంబర్ 16 నుంచి ‘మోనార్క్’ సెట్స్ లో జాయిన్ అవబోతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారు.

కాగా బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇంతకముందు ప్లాపుల్లో ఉన్న బాలయ్యను హిట్ ట్రాక్ ఎక్కించిన బోయపాటి.. మళ్ళీ ఆయనకు కమ్ బ్యాక్ సినిమా ఇస్తాడని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఇటీవల విడుదలైన బిబి3 ‘ఫస్ట్ రోర్’ టీజర్ కు విశేష స్పందన వచ్చింది. బాలయ్య పంచ కట్టుతో మీసం మెలేస్తూ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్ కి ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తారని టాక్ నడుస్తోంది. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అంటున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.